ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌పై సీబీఐ కేసు

కెనరా బ్యాంక్‌ నేతృత్వంలోని  19 బ్యాంకుల కన్సార్షియంకు రూ.6,524 కోట్లకు పైగా నష్టం చేశారన్న ఆరోపణలపై ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ నెట్‌వర్క్‌ లిమిటెడ్‌, కంపెనీ అప్పటి డైరెక్టర్లపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ను దాఖలు చేసింది.

Published : 03 Jun 2023 01:51 IST

దిల్లీ: కెనరా బ్యాంక్‌ నేతృత్వంలోని  19 బ్యాంకుల కన్సార్షియంకు రూ.6,524 కోట్లకు పైగా నష్టం చేశారన్న ఆరోపణలపై ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ నెట్‌వర్క్‌ లిమిటెడ్‌, కంపెనీ అప్పటి డైరెక్టర్లపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ను దాఖలు చేసింది. నేరపూరిత కుట్ర, మోసం ఆరోపణలతో పాటు అవినీతి నిరోధక చట్టం కింద ముంబయికి చెందిన ఐటీఎన్‌ఎల్‌, దాని డైరెక్టర్లు కరుణాకరన్‌ రామ్‌చంద్‌, దీపక్‌దాస్‌ గుప్తా, ముకుంద్‌ గజానన్‌ సప్రే, అప్పటి సీఎఫ్‌ఓ దిలీప్‌ లాల్‌చంద్‌ భాటియాలపై ఎఫ్‌ఐఆర్‌లో అభియోగాలు మోపింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు చెందిన దిల్లీ, గురుగ్రామ్‌, ముంబయి నివాసాల్లో ఇటీవల సీబీఐ సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. పలు మార్గాల్లో 19 బ్యాంకులను మోసం చేసేందుకు వీరు కుట్ర చేసినట్లు సీబీఐ ఆరోపించింది. ఈ రుణ ఖాతాను 2018లో నిరర్థక ఆస్తి (ఎన్‌పీఏ)గా ప్రకటించగా.. 2021లో ‘మోసం’గా వర్గీకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని