7% పెరిగిన హీరో విక్రయాలు

దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్‌ టోకు విక్రయాలు గత నెలలో 5,19,474కు చేరాయి. 2022 మే వాహన విక్రయాలు 4,86,704తో పోలిస్తే ఇవి 7 శాతం ఎక్కువ.

Published : 03 Jun 2023 01:51 IST

దిల్లీ: దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్‌ టోకు విక్రయాలు గత నెలలో 5,19,474కు చేరాయి. 2022 మే వాహన విక్రయాలు 4,86,704తో పోలిస్తే ఇవి 7 శాతం ఎక్కువ. దేశీయ విక్రయాలు సైతం 4,66,466 నుంచి 5,08,309 వాహనాలకు చేరాయి. ఎగుమతులు మాత్రం 20,238 నుంచి 11,165 వాహనాలకు పరిమితమయ్యాయి.

* తగ్గిన హోండా విక్రయాలు: గత నెలలో హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా విక్రయాలు 6.6 శాతం తగ్గి 3,29,393కు పరిమితమయ్యాయి. 2022 మేలో 3,52,893 వాహనాలను కంపెనీ విక్రయించింది. దేశీయ విక్రయాలు కూడా 3,20,857 నుంచి 3% తగ్గి 3,11,144 వాహనాలకు పరిమితమయ్యాయి. ఎగుమతులు కూడా 32,036 నుంచి 18,249 వాహనాలకు తగ్గాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని