26 విమానాలు.. 152 రోజువారీ సర్వీసులు
దివాలా పరిష్కార ప్రక్రియను ఎదుర్కొంటున్న విమానయాన సంస్థ గోఫస్ట్.. 26 విమానాలు, 152 రోజువారీ విమాన సర్వీసులతో కార్యకలాపాల పునఃప్రారంభానికి ప్రణాళికను రూపొందించినట్లుగా తెలుస్తోంది.
ప్రణాళిక సమర్పించిన గోఫస్ట్!
దిల్లీ: దివాలా పరిష్కార ప్రక్రియను ఎదుర్కొంటున్న విమానయాన సంస్థ గోఫస్ట్.. 26 విమానాలు, 152 రోజువారీ విమాన సర్వీసులతో కార్యకలాపాల పునఃప్రారంభానికి ప్రణాళికను రూపొందించినట్లుగా తెలుస్తోంది. దీనిని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ)కు సమర్పించినట్లుగా సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే నిర్వహణ మూలధన అవసరాల నిమిత్తం నిధుల కోసం రుణ సంస్థలతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈ పునరుద్ధరణ ప్రణాళికపై డీజీసీఏ అనుమతుల కోసం గోఫస్ట్ యాజమాన్యం ఎదురుచూస్తోందని, అనుమతులు లభించాక వెంటనే సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభిస్తుందని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రణాళికపై డీజీసీఏ ఉన్నతాధికారులతో గోఫస్ట్ ఉన్నతాధికార్లు కూడా చర్చలు జరిపినట్లు వెల్లడించాయి. డీజీసీఏ కొన్ని అభ్యంతరాలను, మరికొన్ని అంశాలపై స్పష్టతను కోరగా.. వాటికి గోఫస్ట్ అధికారులు బదులిచ్చినట్లు తెలిపాయి. కాగా.. మే 3 నుంచి విమాన సర్వీసులన్నింటినీ గోఫస్ట్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు రోజువారీ 200 విమాన సర్వీసులను గోఫస్ట్ నడిపేది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్‌లో భారత హైకమిషనర్‌కు నిరసన సెగ.. గురుద్వారాలోకి వెళ్లకుండా అడ్డగింత
-
Chidambaram: మహిళా రిజర్వేషన్.. నీటిలో జాబిల్లి: కాంగ్రెస్ నేత చిదంబరం
-
ODI WC 2023: వరల్డ్ కప్ వారిదే.. ఫేవరెట్ టీమ్ చెప్పేసిన సునీల్ గావస్కర్
-
Smile Pinki: ఆస్కార్ విజేత పింకీ ఇంటికి కూల్చివేత నోటీసులు
-
Kantara: ‘కాంతార’కు ఏడాది.. నిర్మాణ సంస్థ స్పెషల్ పోస్ట్
-
Vijayawada: విద్యార్థుల అరెస్ట్.. రణరంగంగా మారిన ధర్నా చౌక్