జేబీఎఫ్ పెట్రోకెమికల్స్‌లో గెయిల్ రూ.2100 కోట్ల పెట్టుబడి
ప్రైవేట్ రంగ రసాయనాల కంపెనీ జేబీఎఫ్ పెట్రోకెమికల్స్‌లో గెయిల్ రూ.2,100 కోట్లు పెట్టుబడిగా పెట్టింది. జేబీఎఫ్‌ను దివాలా పరిష్కార ప్రక్రియలో గెయిల్ కొనుగోలు చేసింది.
దిల్లీ: ప్రైవేట్ రంగ రసాయనాల కంపెనీ జేబీఎఫ్ పెట్రోకెమికల్స్‌లో గెయిల్ రూ.2,100 కోట్లు పెట్టుబడిగా పెట్టింది. జేబీఎఫ్‌ను దివాలా పరిష్కార ప్రక్రియలో గెయిల్ కొనుగోలు చేసింది. దివాలా పరిష్కార ప్రణాళికలోని ఒప్పందం ప్రకారం.. ఈక్విటీ రూపేణా రూ.625 కోట్లు, డెట్ కింద రూ.1,476 కోట్లు చొప్పున మొత్తంగా రూ.2,101 కోట్లను పెట్టుబడిగా పెట్టినట్లు ఎక్స్ఛేంజీలకు గెయిల్ తెలియజేసింది. దీని ప్రకారం.. 2023 జూన్ 1 నుంచి గెయిల్‌కు జేబీఎఫ్ పూర్తి స్థాయి అనుబంధ సంస్థగా మారిందని పేర్కొంది. జేబీఎఫ్ నుంచి ఐడీబీఐ బ్యాంకు, ఇతర బ్యాంకుల బృందానికి రావాల్సిన రూ.5,628 కోట్ల బకాయిల వసూలు కోసం చేపట్టిన దివాలా పరిష్కార ప్రక్రియలో ఓఎన్‌జీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) కన్సార్షియంతో పోటీపడి గెయిల్ విజయవంత బిడ్డర్‌గా నిలిచింది. మంగళూరు సెజ్ వద్ద 1.25 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో కూడిన ప్యూరిఫైడ్ టెరిఫ్తాలిక్ యాసిడ్ ప్లాంటు ఏర్పాటు నిమిత్తం 2008లో జేబీఎఫ్ పెట్రోకెమికల్స్‌ను ఏర్పాటు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ODI WC 2023: హైదరాబాద్‌లో ఘన స్వాగతం.. మేమంతా ఫిదా: పాక్ క్రికెటర్
-
Srinivas Goud: మోదీ క్షమాపణ చెప్పి సభలో మాట్లాడాలి: శ్రీనివాస్‌గౌడ్
-
Siddharth: దానివల్ల మా సినిమాకు ఎంతో నష్టం.. ప్రెస్‌మీట్ అడ్డుకోవడంపై సిద్ధార్థ్
-
World Culture Festival : మానసిక అనారోగ్యం అనేది అతి పెద్ద సమస్య : శ్రీశ్రీ రవిశంకర్
-
Vizag: విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ పెట్టె.. అందులో ఏముందో?
-
Jaishankar: ఆధారాలుంటే చూపించండి.. చూస్తాం: కెనడాను కడిగేసిన జైశంకర్