సహారా లైఫ్‌ను విలీనం చేసుకోలేదు

సహారా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీదార్లకు సంబంధించిన ఆస్తులు, అప్పుల బదిలీ మాత్రమే జరిగిందని.. ఇది రెండు కంపెనీల మధ్య విలీనం కాదని ఎస్‌బీఐ అనుబంధ సంస్థ ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ స్పష్టం చేసింది.

Updated : 04 Jun 2023 06:42 IST

పాలసీదార్ల ఆస్తుల బదిలీ మాత్రమే: ఎస్‌బీఐ లైఫ్‌

దిల్లీ: సహారా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీదార్లకు సంబంధించిన ఆస్తులు, అప్పుల బదిలీ మాత్రమే జరిగిందని.. ఇది రెండు కంపెనీల మధ్య విలీనం కాదని ఎస్‌బీఐ అనుబంధ సంస్థ ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ స్పష్టం చేసింది. సహారా ఇండియా లైఫ్‌ ఇన్సూరెన్స్‌కు చెందిన దాదాపు రెండు లక్షల పాలసీలు, ఆస్తులను తక్షణమే టేకోవర్‌ చేయాల్సిందిగా ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ను  శుక్రవారం బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ ఆదేశించిన విషయం తెలిసిందే. సహారా లైఫ్‌ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తున్న నేపథ్యంలో ఐఆర్‌డీఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఐఆర్‌డీఏఐ ఆదేశాలతో రెండు లక్షల పాలసీదార్లకు అత్యున్నత స్థాయి సేవలు అందిస్తామని ఎస్‌బీఐ లైఫ్‌ భరోసా ఇచ్చింది. పాలసీదార్లను తమ వ్యవస్థలతో ఏకీకృతం చేసే ప్రక్రియను ప్రారంభించామని, వేగంగా పూర్తి చేసేందుకు చూస్తున్నట్లు వెల్లడించింది. పాలసీదార్లు తమ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1800 267 9090 లేదా saharalife@sbilife .co.inకు ఇ-మెయిల్‌ ద్వారా సంప్రదించాల్సిందిగా ఎస్‌బీఐ లైఫ్‌ సూచించింది. సహారా లైఫ్‌ పాలసీదార్లకు తమ సేవలపై త్వరలోనే సమాచారం ఇవ్వనున్నట్లు వివరించింది. కొత్త వ్యాపారాన్ని అండర్‌రైట్‌ చేసేందుకు సహారా లైఫ్‌ ఇన్సూరెన్స్‌కు అనుమతి లభించలేదు. దీంతో నియంత్రణపరమైన నిబంధనలను అందుకునేందుకు తదుపరి ఆదేశాలను ఐఆర్‌డీఏఐ జారీ చేసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు