14 మిశ్రమ ఔషధాలపై కేంద్రం నిషేధం

14 రకాలైన ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌ (ఎఫ్‌డీసీ) ఔషధాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. రెండు లేదా అంతకంటే ఎక్కువ ఔషధాలను కలిపి ఒకే ఔషధంగా ఆవిష్కరిస్తే, దాన్ని ఎఫ్‌డీసీ ఔషధంగా పరిగణిస్తున్నారు.

Updated : 04 Jun 2023 02:20 IST

ప్రజలకు ప్రమాదం తలెత్తవచ్చనే

దిల్లీ: 14 రకాలైన ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌ (ఎఫ్‌డీసీ) ఔషధాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. రెండు లేదా అంతకంటే ఎక్కువ ఔషధాలను కలిపి ఒకే ఔషధంగా ఆవిష్కరిస్తే, దాన్ని ఎఫ్‌డీసీ ఔషధంగా పరిగణిస్తున్నారు. ఈ మిశ్రమ ఔషధాల సహేతుకత నిర్ధారణ కాలేదని, పైగా వీటివల్ల ప్రజలకు ప్రమాదం తలెత్తవచ్చని ప్రభుత్వం వివరించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. నిమెసులైడ్‌-  పారాసెట్మాల్‌ డిస్‌పెర్సిబుల్‌ ట్యాబ్లెట్లు, క్లోఫెనిరమైన్‌ మలేట్‌- కొడైన్‌ సిరప్‌,  ఫోల్కోడైన్‌- ప్రొమెథజైన్‌, ఆమాగ్జిసిలిన్‌- బ్రోమ్‌హెగ్జిన్‌, బ్రోమ్‌హెగ్జిన్‌- డెక్స్‌ట్రోమెథార్ఫన్‌- అమ్మోనియమ్‌ క్లోరైడ్‌- మెంథాల్‌, పారాసెట్మాల్‌- బ్రోమ్‌హెగ్జిన్‌- ఫెనైల్‌ఫిరిన్‌- క్లోర్‌ఫెనిరమైన్‌- గాఫెనెసిన్‌, సల్బుటమాల్‌- బ్రోమ్‌హెగ్జిన్‌... తదితర మిశ్రమ ఔషధాలు ప్రభుత్వం నిషేధించిన జాబితాలో ఉన్నాయి. ఈ అంశంపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2016లో ఒకసారి ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం 322 ఎఫ్‌డీసీ ఔషధాలను నిషేధించింది. అదే కోవలో మళ్లీ ఇప్పుడు 14 ఔషధాలపై నిషేధం విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని