ఇండియన్ బ్యాంక్, యెస్ బ్యాంక్ ఎంసీఎల్‌ఆర్ పెంపు
ప్రభుత్వ రంగంలోని ఇండియన్ బ్యాంక్ నిధుల ఆధారిత రుణ వడ్డీ రేటు (ఎంసీఎల్‌ఆర్) 5 బేసిస్ పాయింట్ల మేరకు పెంచుతున్నట్లు తెలిపింది.
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ రంగంలోని ఇండియన్ బ్యాంక్ నిధుల ఆధారిత రుణ వడ్డీ రేటు (ఎంసీఎల్‌ఆర్) 5 బేసిస్ పాయింట్ల మేరకు పెంచుతున్నట్లు తెలిపింది. శనివారం నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. నెల వడ్డీ రేటు ప్రస్తుతం ఉన్న 8.10 శాతం నుంచి 8.15 శాతానికి చేరింది. మూడు నెలల ఎంసీఎల్‌ఆర్ 8.20 శాతం నుంచి 8.25%, ఆరు నెలల వ్యవధికి 8.45 శాతం నుంచి 8.50 శాతం, ఏడాది వ్యవధికి 8.60 శాతం నుంచి 8.65 శాతానికి చేరినట్లు వెల్లడించింది.
నీ యెస్ బ్యాంక్ సైతం ఎంసీఎల్‌ఆర్‌ను 5 బేసిస్ పాయింట్ల మేరకు పెంచింది. నెల వడ్డీ రేటు 8.80 శాతం, మూడు నెలలకు 9.45 శాతం, ఆరు నెలల వ్యవధికి 9.75శాతం, ఏడాది ఎంసీఎల్‌ఆర్ 10.05 శాతంగా ఉంటాయని తెలిపింది.
ఆర్‌బీఎల్ నుంచి ఏస్: అధిక మొత్తంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే వారి కోసం ఆర్‌బీఎల్ బ్యాంకు ప్రత్యేకంగా ‘ఏస్’ను తీసుకొచ్చింది. ఇందులో 12 నెలల నుంచి 240 నెలల వరకూ డిపాజిట్ చేసేందుకు వీలుంది. సాధారణ డిపాజిటర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్లు, సూపర్ సీనియర్ సిటిజన్లకు 75 బేసిస్ పాయింట్ల మేరకు వడ్డీ అధికంగా ఇస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. సాధారణ డిపాజిటర్లకు 12-15 నెలల వ్యవధికి 7.20 శాతం, 453 రోజుల నుంచి 24 నెలల వరకు 8 శాతం, 24-36 నెలల వ్యవధికి 7.70 శాతం, 36-60 నెలల 1 రోజు వరకు 7.30 శాతం, 60 నెలల 2 రోజుల నుంచి 240 నెలల వరకు 7.20 శాతం చొప్పున వడ్డీ ఇస్తున్నట్లు పేర్కొంది. రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకూ ఈ ప్రత్యేక పథకంలో డిపాజిట్ చేయొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News: నిర్మాత అంజిరెడ్డి హత్యను ఛేదించిన పోలీసులు
-
Team India: టీమ్ఇండియా ఆటగాళ్ల రీల్.. కోహ్లీ లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్న అభిమానులు
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/10/2023)
-
Rahul Gandhi: నేను చెప్పింది మోదీ అంగీకరించారు: రాహుల్ గాంధీ
-
TMC: మా ఎంపీలు, మంత్రులపై దిల్లీ పోలీసులు చేయి చేసుకున్నారు: తృణమూల్ కాంగ్రెస్
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..