హీరో విడా వీ1 ప్రో ధర రూ.6000 పెంపు

విద్యుత్‌ స్కూటర్‌ మోడల్‌ విడా వీ1 ప్రో ధరను దాదాపు రూ.6000 పెంచుతున్నట్లు హీరో మోటోకార్ప్‌ ప్రకటించింది. జూన్‌ 1 నుంచి విద్యుత్‌ ద్విచక్రవాహనాలపై ఇచ్చే రాయితీలను ప్రభుత్వం తగ్గించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

Published : 05 Jun 2023 03:02 IST

దిల్లీ: విద్యుత్‌ స్కూటర్‌ మోడల్‌ విడా వీ1 ప్రో ధరను దాదాపు రూ.6000 పెంచుతున్నట్లు హీరో మోటోకార్ప్‌ ప్రకటించింది. జూన్‌ 1 నుంచి విద్యుత్‌ ద్విచక్రవాహనాలపై ఇచ్చే రాయితీలను ప్రభుత్వం తగ్గించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఫేమ్‌-2 రాయితీ, పోర్టబుల్‌ ఛార్జర్‌ కలుపుకుని విడా వీ1 ప్రో స్కూటర్‌ రూ.1,45,900కు లభించనుంది. పాత ధరతో పోలిస్తే ఇది దాదాపు రూ.6000 అధికం. ధరల పెంపు వార్తలను కంపెనీ డీలర్‌ ఒకరు ధ్రువీకరించారు. కంపెనీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. విద్యుత్‌ స్కూటర్లకు ఎక్స్‌ ఫ్యాక్టరీ ధరపై ప్రోత్సాహకాలు ఇప్పటివరకు 40 శాతంగా ఉండగా.. వాటిని 15 శాతానికి పరిమితం చేశారు.  ఫేమ్‌-2 సవరణల కారణంగా ప్రతి వాహన రాయితీపై దాదాపు రూ.32,000 వరకు ప్రభావం పడింది. ఫలితంగా టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ, ఏథర్‌ ఎనర్జీ, ఓలా ఎలక్ట్రిక్‌ ఇప్పటికే తమ విద్యుత్తు స్కూటర్ల ధరలను పెంచాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని