తల్లిదండ్రుల్ని కోల్పోయిన చిన్నారులకు ఉచిత విద్య: అదానీ

రైలు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన బాధిత చిన్నారులకు ఉచిత పాఠశాల విద్యను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు గౌతమ్‌ అదానీ ఆదివారం వెల్లడించారు.

Published : 05 Jun 2023 01:27 IST

దిల్లీ: రైలు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన బాధిత చిన్నారులకు ఉచిత పాఠశాల విద్యను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు గౌతమ్‌ అదానీ ఆదివారం వెల్లడించారు. ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో బాధితులైన వారి కుటుంబాలకు సాయం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి పిల్లలకు మంచి భవిష్యత్‌ ఇచ్చేందుకు వీలుగా పాఠశాల విద్యను ఉచితంగా అందిస్తామని ఆయన ట్వీట్‌ చేశారు. గత మూడు దశాబ్దాల్లోనే అతి పెద్దదైన ఒడిశా రైలు ప్రమాదంలో సుమారు 300 మంది వరకు మృతి చెందగా, వందల మంది క్షతగాత్రులైన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని