మేలో వాహన రిటైల్‌ విక్రయాలు 10% పెరిగాయ్‌: ఫాడా

వాహన రిటైల్‌ విక్రయాలు గత నెలలో 10 శాతం పెరిగాయని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా సోమవారం వెల్లడించింది. ప్రయాణికుల వాహనాలు, ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్ల విభాగాల్లో బలమైన గిరాకీ కనిపించడంతోనే ఇది సాధ్యమైందని పేర్కొంది.

Published : 06 Jun 2023 01:44 IST

దిల్లీ: వాహన రిటైల్‌ విక్రయాలు గత నెలలో 10 శాతం పెరిగాయని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా సోమవారం వెల్లడించింది. ప్రయాణికుల వాహనాలు, ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్ల విభాగాల్లో బలమైన గిరాకీ కనిపించడంతోనే ఇది సాధ్యమైందని పేర్కొంది. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం వాహన రిటైల్‌ విక్రయాలు 20,19,414కు చేరాయి. 2022 మేలో ఇవి 18,33,421గా నమోదయ్యాయి. వాహనాల లభ్యత పెరగడంతో పాటు గిరాకీ పుంజుకోవడం, కొత్త మోడళ్ల విడుదల బాగా కలిసొచ్చిందని ఫాడా అధ్యక్షుడు మనీశ్‌ రాజ్‌ సింఘానియా వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని