కియా సెల్టోస్‌ @ 5 లక్షలు

కియా సెల్టోస్‌ 5 లక్షల కార్ల అమ్మకాల మైలురాయిని అధిగమించింది. ఈ కారును ఆవిష్కరించిన 46 నెలల వ్యవధిలోనే ఈ ఘనతను సాధించినట్లు కియా ఇండియా వెల్లడించింది.

Updated : 06 Jun 2023 04:13 IST

ఈనాడు, హైదరాబాద్‌: కియా సెల్టోస్‌ 5 లక్షల కార్ల అమ్మకాల మైలురాయిని అధిగమించింది. ఈ కారును ఆవిష్కరించిన 46 నెలల వ్యవధిలోనే ఈ ఘనతను సాధించినట్లు కియా ఇండియా వెల్లడించింది. సెల్టోస్‌ను దేశీయ మార్కెట్లో 2019 ఆగస్టులో విడుదల చేశారు. ఈ కారు మన దేశంలో కార్ల మార్కెట్లో కియా ఇండియా వేళ్లూనుకునేందుకు దోహదపడింది. కియా ఇండియా కార్ల అమ్మకాల్లో సెల్టోస్‌ వాటా 55% వరకూ ఉండటమే దీనికి నిదర్శనం. అంతేగాక ఇప్పటి వరకూ మన దేశం నుంచి 1,35,885 సెల్టోస్‌ కార్లను వివిధ దేశాలకు ఎగుమతి చేశారు. ప్రతి నెలా దాదాపు 9,000 సెల్టోస్‌ కార్లను విక్రయిస్తున్నట్లు, ఈ ఏడాది మొదటి 3 నెలల కాలంలో 27,159 కార్లను వినియోగదార్లకు అందించినట్లు కియా ఇండియా ఎండీ తే-జిన్‌ పార్క్‌ వివరించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు