ఏపీజీవీబీ ఛైర్మన్‌గా ప్రతాప రెడ్డి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ప్రాయోజిత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ) అయిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) కొత్త ఛైర్మన్‌గా కె.ప్రతాప రెడ్డి బాధ్యతలను స్వీకరించారు.
ఈనాడు, హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ప్రాయోజిత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ) అయిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) కొత్త ఛైర్మన్‌గా కె.ప్రతాప రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటివరకూ ఈయన ఎస్‌బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా ఉన్నారు. వ్యవసాయం, ఆర్థిక సేవలు, రిటైల్ కమర్షియల్, గ్రామీణ బ్యాంకింగ్ తదితర విభాగాల్లో ప్రతాప రెడ్డికి మంచి అనుభవం ఉంది. ఈ పదవిలో ఈయన అయిదేళ్లపాటు కొనసాగుతారు. గత ఆర్థిక సంవత్సరంలో ఏపీజీవీబీ రూ.1,046 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకు క్రితంతో పోలిస్తే ఇది 28.61 శాతం అధికమని బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో 771 శాఖలున్నాయని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్
-
Law Commission: ‘జమిలి’ నివేదికపై కసరత్తు జరుగుతోంది.. లా కమిషన్ ఛైర్మన్
-
IND vs AUS: టీమ్ఇండియా ఆలౌట్.. మూడో వన్డేలో ఆస్ట్రేలియా విజయం
-
Cheetah : భారత్‌కు ఉత్తర ఆఫ్రికా దేశాల చీతాలు.. పరిశీలిస్తున్న అధికారులు!
-
Sreeleela: వాటి ఎంపికలో జాగ్రత్తగా ఉంటా.. ఆ జానర్‌పై ఇష్టం పెరిగింది: శ్రీలీల