రూ.21,730 కోట్ల రుణాలు చెల్లించిన అదానీ గ్రూప్‌

అమెరికా షార్ట్‌సెల్లర్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలువడిన తర్వాత అదానీ గ్రూప్‌పై తీవ్ర ప్రభావం పడింది. దీంతో మదుపర్ల నమ్మకాన్ని తిరిగి పొందేందుకు ఆ గ్రూప్‌ కంపెనీలు తీసుకున్న రుణాలను ముందుగానే తిరిగి చెల్లించడం ప్రారంభించారు.

Published : 06 Jun 2023 01:44 IST

దిల్లీ: అమెరికా షార్ట్‌సెల్లర్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలువడిన తర్వాత అదానీ గ్రూప్‌పై తీవ్ర ప్రభావం పడింది. దీంతో మదుపర్ల నమ్మకాన్ని తిరిగి పొందేందుకు ఆ గ్రూప్‌ కంపెనీలు తీసుకున్న రుణాలను ముందుగానే తిరిగి చెల్లించడం ప్రారంభించారు. ఇప్పటి వరకు 2.65 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.21,730 కోట్లు) రుణాలు తిరిగి చెల్లించినట్లు సోమవారం అదానీ గ్రూప్‌ రుణ నివేదికను విడుదల చేసింది. నమోదిత సంస్థల షేర్లను తనఖా పెట్టి తీసుకున్న మొత్తం 2.15 బి.డాలర్ల రుణాలను పూర్తిగా తిరిగి చెల్లించినట్లు అందులో పేర్కొంది. అంబుజా సిమెంట్‌ను కొనుగోలు చేసేందుకు తీసుకున్న 700 మిలియన్‌ డాలర్ల రుణాలను సైతం చెల్లించినట్లు తెలిపింది. ముందస్తు చెల్లింపులో భాగంగా 203 మి.డాలర్ల వడ్డీని సైతం చెల్లించినట్లు వివరించింది. తమ 4 నమోదిత గ్రూప్‌ సంస్థల్లోని కొంత వాటా షేర్లను దిగ్గజ అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ జీక్యూజీ పార్ట్‌నర్స్‌కు 1.87 బి.డాలర్ల(రూ.15,446 కోట్లు)కు విక్రయించే ప్రక్రియను పూర్తి చేసినట్లు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని