రూ.2.65 లక్షల కోట్లకు పేటీఎం జీఎంవీ

పేటీఎం బ్రాండ్‌ నిర్వహించే ఫిన్‌టెక్‌ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ స్థూల మర్చండైజ్‌ విలువ(జీఎంవీ) ఈ ఏడాది ఏప్రిల్‌-మే మధ్య 35 శాతం పెరిగి రూ.2.65 లక్షల కోట్లకు వృద్ధి చెందింది.

Published : 06 Jun 2023 01:44 IST

దిల్లీ: పేటీఎం బ్రాండ్‌ నిర్వహించే ఫిన్‌టెక్‌ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ స్థూల మర్చండైజ్‌ విలువ(జీఎంవీ) ఈ ఏడాది ఏప్రిల్‌-మే మధ్య 35 శాతం పెరిగి రూ.2.65 లక్షల కోట్లకు వృద్ధి చెందింది. ఏడాది క్రితం ఇదే సమయంలో కంపెనీ జీఎంవీ రూ.1.96 లక్షల కోట్లుగా నమోదైంది. ‘ఏప్రిల్‌, మే నెలల్లో మొత్తం మర్చంట్‌ జీఎంవీ 35% పెరిగి రూ.2.65 లక్షల కోట్లు (32.1 బిలియన్‌ డాలర్లు)గా ఉంది. గత కొన్ని త్రైమాసికాల్లో చెల్లింపుల సంఖ్యపై దృష్టి పెట్టడంతో లాభదాయకత అధికమైంది. నికర చెల్లింపుల మార్జిన్‌ లేదా డైరెక్ట్‌ అప్‌సెల్‌ వల్ల ఇది సాధ్యమైంది’ అని పేటీఎం పనితీరు సమాచారంలో వెల్లడించింది. ఏప్రిల్‌-మే మధ్య భాగస్వాముల ద్వారా పేటీఎం పంపిణీ చేసిన రుణాల విలువ రూ.3,576 కోట్ల నుంచి రెట్టింపై రూ.9,618 కోట్లకు చేరింది. యాప్‌పై నెలవారీ లావాదేవీ జరిపిన వినియోగదారుల సంఖ్య 7.4 కోట్ల నుంచి 24 శాతం వృద్ధితో 9.2 కోట్లకు చేరింది. పేటీఎం ఇన్‌స్టాల్‌ చేసిన చెల్లింపుల పరికరాలు 34 లక్షల నుంచి 75 లక్షలకు పెరిగాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు