ఎంఎస్‌ఎంఈలకు రూ.800 కోట్ల రుణాలు
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆఖరుకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) సంస్థలకు రూ.800 కోట్ల రుణాలను అందించనున్నట్లు కినారా క్యాపిటల్ వెల్లడించింది.
కినారా క్యాపిటల్
ఈనాడు, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆఖరుకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) సంస్థలకు రూ.800 కోట్ల రుణాలను అందించనున్నట్లు కినారా క్యాపిటల్ వెల్లడించింది. సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తిరునావుక్కరసు మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో 20వేలకు పైగా చిన్న వ్యాపార సంస్థలకు రూ.1,200 కోట్ల వరకు రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లో 20% వృద్ధిని ఆశిస్తున్నట్లు వివరించారు. 12-60 నెలల వ్యవధికి రూ.1-30 లక్షల హామీలేని వ్యాపార రుణాలను అందిస్తున్నామన్నారు. మహిళలకు హర్ వికాస్ పథకాన్ని తీసుకొచ్చామన్నారు. వీరికి వడ్డీలో 1-2% రాయితీ ఇస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 27 శాఖలు, 300 మంది ఉద్యోగులున్నారని, కొత్తగా 150 మందిని తీసుకుంటామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
AP Assembly: ఎసైన్డ్ భూములను 20 ఏళ్ల తర్వాత బదలాయించుకోవచ్చు
-
పుంగనూరు కేసులో కుమారుడికి బెయిల్ రాలేదని.. తల్లి ఆత్మహత్యాయత్నం
-
Supreme Court: అరుదైన ఘట్టం.. సంజ్ఞల భాషలో సుప్రీంకోర్టులో వాదన
-
TS TET Results: రేపు టెట్ ఫలితాలు
-
ఏసీ వేసుకుని నిద్రపోయిన డాక్టర్.. చలికి ఇద్దరు నవజాత శిశువుల మృతి
-
Imran khan: త్వరలో సకల సౌకర్యాలున్నజైలుకు ఇమ్రాన్