చమురు సరఫరాలో సౌదీ అరేబియా కోత!

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు చేసే చమురు సరఫరాలో సౌదీ అరేబియా కోత వేయనుంది. చమురు ఉత్పత్తిలో ఒపెక్‌+ అనుబంధ దేశాలు రెండు సార్లు కోత వేసినప్పటికీ.. ధరలు పెరగనందున, సౌదీ అరేబియా ఈ ఏకపక్ష నిర్ణయం తీసుకుంది.

Published : 07 Jun 2023 03:11 IST

ఫ్రాంక్‌ఫర్ట్‌: అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు చేసే చమురు సరఫరాలో సౌదీ అరేబియా కోత వేయనుంది. చమురు ఉత్పత్తిలో ఒపెక్‌+ అనుబంధ దేశాలు రెండు సార్లు కోత వేసినప్పటికీ.. ధరలు పెరగనందున, సౌదీ అరేబియా ఈ ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. జులై నుంచి రోజుకు 10 లక్షల బారెళ్ల మేర చమురు ఉత్పత్తి తగ్గించనుంది. అంతక్రితం నిర్ణయించిన ఉత్పత్తి కోతలనే వచ్చే ఏడాది వరకు కొనసాగించాలని ఇతర ఒపెక్‌+ దేశాలు వియన్నాలో జరిగిన సమావేశంలో అంగీకరించడం గమనార్హం. చమురు ఉత్పత్తి కోత నిర్ణయంపై సౌదీ ఇంధన మంత్రి అబ్దుల్‌అజీజ్‌ బిన్‌ సల్మాన్‌ మాట్లాడుతూ ‘ఈ కోత కొనసాగొచ్చు. మార్కెట్‌ ధరల్లో స్థిరత్వాన్ని తీసుకురావడానికి ఇతర దేశాలూ అందుకు కావాల్సిన చర్యలు చేపట్టే అవకాశం ఉంద’ని అన్నారు. తాజా పరిణామం వల్ల స్వల్పకాలంలో చమురు ధరలు పెరగొచ్చు. సౌదీ అరేబియా ఈ కోతను కొనసాగిస్తుందా లేదా అన్నదానిపై ఆధారపడి, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని