వృద్ధి రేటు 6.3% ప్రపంచ బ్యాంకు అంచనా

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు 6.3 శాతానికి పరిమితం కానుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.

Published : 07 Jun 2023 03:18 IST

ఈనాడు, దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు 6.3 శాతానికి పరిమితం కానుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఆ సంస్థ మంగళవారం విడుదల చేసిన ‘గ్లోబల్‌ ఎకనమిక్‌ ప్రాస్పెక్ట్స్‌’ నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. ‘2023-24లో భారత్‌ వృద్ధిరేటు మరింత మందగించి 6.3 శాతానికి పరిమితం కానుంది. జనవరిలో అంచనా వేసిన దానికంటే ఇది 0.3% తక్కువ. అధిక ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్ల కారణంగా ప్రైవేటు వినియోగం తగ్గడంతో పాటు, ఆర్థిక సంఘటితత్వం కోసం చేసే ప్రయత్నాల్లో ప్రభుత్వ వినియోగం ప్రభావితం కావడం ఇందుకు ప్రధాన కారణం.  అభివృద్ధి చెందుతున్న మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌ వేగంగా అభివృద్ధిచెందే ఆర్థిక వ్యవస్థగా ఉంటుంది’ అని పేర్కొంది. ఇండియా వాస్తవ జీడీపీ 2023లో 6.3%, 2024లో 6.4, 2025లో 6.5%మేర ఉంటుందని అంచనా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని