బిర్లా ఆభరణాలు నావెల్ జువెల్స్ పేరిట బ్రాండెడ్ రిటైల్ వ్యాపారం
బ్రాండెడ్ ఆభరణాల రిటైల్ వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ఆదిత్య బిర్లా గ్రూప్ వెల్లడించింది. దీని కోసం రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది.
రూ.5,000 కోట్ల పెట్టుబడులు
కుమార మంగళం బిర్లా
దిల్లీ: బ్రాండెడ్ ఆభరణాల రిటైల్ వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ఆదిత్య బిర్లా గ్రూప్ వెల్లడించింది. దీని కోసం రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. నావెల్ జువెల్స్ పేరిట ఆభరణాల రిటైల్ విక్రయశాలలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయబోతున్నట్లు గ్రూప్ తెలిపింది. ‘వృద్ధి అవకాశాలున్న భారతీయ రిటైల్ ఆభరణాల రంగంలోకి విస్తరిస్తున్నామ’ని గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా వెల్లడించారు. ప్రజల వద్ద మిగులు ఆదాయం పెరుగుతున్నందున, డిజైన్-ఆధారిత, అధిక నాణ్యతతో కూడిన ఆభరణాల వైపు మొగ్గు చూపుతున్నారని బిర్లా తెలిపారు. వినియోగదార్ల మనసుకు నచ్చినట్లు, వారి జీవన విధానానికి తగ్గట్లు ఆభరణాలను డిజైన్ చేసేందుకు తమ వద్ద మంచి నిపుణులు ఉన్నారని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
AP Assembly: ఎసైన్డ్ భూములను 20 ఏళ్ల తర్వాత బదలాయించుకోవచ్చు
-
పుంగనూరు కేసులో కుమారుడికి బెయిల్ రాలేదని.. తల్లి ఆత్మహత్యాయత్నం
-
Supreme Court: అరుదైన ఘట్టం.. సంజ్ఞల భాషలో సుప్రీంకోర్టులో వాదన
-
TS TET Results: రేపు టెట్ ఫలితాలు
-
ఏసీ వేసుకుని నిద్రపోయిన డాక్టర్.. చలికి ఇద్దరు నవజాత శిశువుల మృతి
-
Imran khan: త్వరలో సకల సౌకర్యాలున్నజైలుకు ఇమ్రాన్