విపణిలోకి శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎఫ్‌ 54

శామ్‌సంగ్‌ ఇండియా సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ ఎఫ్‌54ను విపణిలోకి విడుదల చేసింది.

Published : 07 Jun 2023 03:27 IST

దిల్లీ: శామ్‌సంగ్‌ ఇండియా సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ ఎఫ్‌54ను విపణిలోకి విడుదల చేసింది. పరిచయ ధర రూ.27,999. ఫ్లిప్‌కార్ట్‌, శామ్‌సంగ్‌ వెబ్‌సైట్లతో పాటు ఎంపిక చేసిన విక్రయ కేంద్రాల్లో దీనిని విక్రయించనున్నట్లు శామ్‌సంగ్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (మొబైల్‌ వ్యాపారం) రాజు పుల్లాన్‌ తెలిపారు. 8జీబీ+256 జీబీ వేరియంట్‌లో ఇది లభ్యం కానుంది. 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ సూపర్‌ అమోల్డ్‌ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌, 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, వెనుక 108 మెగాపిక్సెల్‌ ప్రధాన కెమేరా, 8 ఎంపీ అల్ట్రావైడ్‌ కెమేరా, 2 ఎంపీ మాక్రో సెన్సార్‌, ముందు వైపు 32 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమేరా, ఎగ్జినోస్‌ 1380 ప్రాసెసర్‌ లాంటి ప్రత్యేకతలు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని