TATA Group: అత్యంత విలువైన బ్రాండ్‌ టాటా గ్రూప్‌

భారత్‌లో అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూప్‌ తన స్థానాన్ని నిలబెట్టుకున్నట్లు బ్రాండ్‌ ఫైనాన్స్‌ తాజా నివేదికలో పేర్కొంది. ఈ గ్రూప్‌ బ్రాండ్‌ విలువ 2022తో పోలిస్తే 10.3% వృద్ధి చెంది 26.38 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.2.16 లక్షల కోట్ల)కు చేరింది.

Updated : 08 Jun 2023 08:19 IST

తర్వాతి స్థానాల్లో ఇన్ఫోసిస్‌, ఎల్‌ఐసీ
బ్రాండ్‌ ఫైనాన్స్‌ గ్లోబల్‌ 500 జాబితా

భారత్‌లో అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూప్‌ తన స్థానాన్ని నిలబెట్టుకున్నట్లు బ్రాండ్‌ ఫైనాన్స్‌ తాజా నివేదికలో పేర్కొంది. ఈ గ్రూప్‌ బ్రాండ్‌ విలువ 2022తో పోలిస్తే 10.3% వృద్ధి చెంది 26.38 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.2.16 లక్షల కోట్ల)కు చేరింది. 25 బిలియన్‌ డాలర్లకు పైగా విలువ కలిగిన ఏకైక భారతీయ బ్రాండ్‌గానూ టాటా గ్రూప్‌ అవతరించింది. బ్రాండ్‌ ఫైనాన్స్‌ 500 సంస్థలతో రూపొందించిన ఈ జాబితా ప్రకారం..

* అగ్రగామి 100 కంపెనీల్లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ బ్రాండ్‌ టాటా గ్రూప్‌ మాత్రమే.

* 13 బిలియన్‌ డాలర్లతో భారత బ్రాండ్లలో ఇన్ఫోసిస్‌ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఎయిర్‌టెల్‌ 4వ స్థానంలో ఉండగా.. 11వ స్థానంలో జియో గ్రూప్‌ నిలిచింది.

*బ్యాంకుల్లో ఎస్‌బీఐ అగ్రస్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఉన్నాయి.

* మహీంద్రా గ్రూప్‌ 17% విలువ పెంచుకుని 7వ స్థానంలోకి వచ్చింది. ఇదే గ్రూప్‌నకు చెందిన మహీంద్రా అండ్‌ మహీంద్రా 53.8% వృద్ధితో 3.6 డాలర్లకు బ్రాండ్‌ విలువను పెంచుకుంది. భారత్‌లో అత్యంత వేగవంతమైన ఆటోమొబైల్‌ బ్రాండ్‌గా.. అంతర్జాతీయంగా అత్యంత వేగవంతమైన టాప్‌-10 ఆటోమొబైల్‌ బ్రాండ్‌గా నిలిచింది. మహీంద్రాతో పాటు టాటా మోటార్స్‌, మారుతీ కూడా విలువ విషయంలో రెండంకెల వృద్ధిని సాధించాయి.

* మార్కెటింగ్‌ పెట్టుబడి, విశ్వసనీయత, సిబ్బంది సంతృప్తి తదితర అంశాల్లో ‘తాజ్‌’ భారత్‌లోనే అత్యంత బలమైన బ్రాండ్‌గా ఉంది.

* లోహ కంపెనీల్లో టాటా స్టీల్‌, హిందాల్కో, వేదాంతా మెరుగైన వృద్ధిని కనబరచాయి.

* రేమండ్‌ అత్యంత విలువైన దుస్తుల బ్రాండ్‌గా నిలిచింది. దీని విలువ 83.2% వృద్ధితో 273 మి. డాలర్లకు చేరుకుంది. భారత్‌లో టాప్‌-100లో స్థానం దక్కించుకుంది.

* ఇండిగో అత్యంత విలువైన(832 మి. డాలర్లు) విమానయాన బ్రాండ్‌గా నిలిచింది. ఎయిరిండియా సైతం 18% వృద్ధితో 365 మి. డాలర్లకు పెంచుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని