మళ్లీ 63000 ఎగువకు సెన్సెక్స్‌

లోహ, ఇంధన, ఎఫ్‌ఎంసీజీ షేర్లకు లభించిన భారీ కొనుగోళ్ల మద్దతుతో దేశీయ సూచీలు బుధవారం లాభాలు ఆర్జించాయి. సెన్సెక్స్‌ 350 పాయింట్లు పెరిగి, మళ్లీ 63,000 ఎగువకు చేరగా, నిఫ్టీ 18,700పైన ముగిసింది.

Updated : 08 Jun 2023 03:09 IST

సమీక్ష
లోహ, ఇంధన షేర్లలో భారీ కొనుగోళ్లు

లోహ, ఇంధన, ఎఫ్‌ఎంసీజీ షేర్లకు లభించిన భారీ కొనుగోళ్ల మద్దతుతో దేశీయ సూచీలు బుధవారం లాభాలు ఆర్జించాయి. సెన్సెక్స్‌ 350 పాయింట్లు పెరిగి, మళ్లీ 63,000 ఎగువకు చేరగా, నిఫ్టీ 18,700పైన ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలున్నా, తాజా విదేశీ పెట్టుబడులు, రూపాయి బలోపేతం కావడం వంటివి కూడా దేశీయ మదుపర్ల సెంటిమెంటును బలోపేతం చేశాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 8 పైసలు పెరిగి 82.52కు చేరింది. బ్రెంట్‌ ముడి చమురు బ్యారెల్‌ 76.45 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో సియోల్‌, షాంఘై, హాంకాంగ్‌ లాభపడగా సియోల్‌ నష్టపోయింది. ఐరోపా సూచీలు మిశ్రమంగా కదలాడాయి.

సెన్సెక్స్‌ ఉదయం 62,917.39 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమైంది. కొనుగోళ్ల మద్దతుతో 63,196.43 పాయింట్లకు చేరింది. లాభాల స్వీకరణ వల్ల ఒక దశలో 62,841.95 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరినా, చివరకు 350.08 పాయింట్ల లాభంతో 63,142.96 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 సైతం 127.40 పాయింట్ల లాభంతో 18,726.40 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచీ 18,738.95-18,636 పాయింట్ల మధ్య కదలాడింది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 25 లాభపడ్డాయి. నెస్లే ఇండియా 2.97%, టాటా స్టీల్‌ 2.29%, టాటా మోటార్స్‌ 2.21%, భారతీ ఎయిర్‌టెల్‌ 1.70%, ఎల్‌అండ్‌టీ 1.66%, పవర్‌గ్రిడ్‌ 1.64%, టీసీఎస్‌ 1.25%, ఎన్‌టీపీసీ 1.20% చొప్పున పెరిగాయి. కోటక్‌ బ్యాంక్‌ 1.15%, బజాజ్‌ ఫైనాన్స్‌ 0.51% మేర నష్టపోయాయి. రంగాల వారీ సూచీలకొస్తే టెలికాం 2.99%, లోహ 1.7%, స్థిరాస్తి 1.52%, చమురు-గ్యాస్‌ 1.34%, విద్యుత్‌ 1.25%, ఇంధన 1.06%, ఎఫ్‌ఎంసీజీ 1.06% చొప్పున రాణించాయి. బీఎస్‌ఈలో 2,259 షేర్లు సానుకూలంగా, 1,302 షేర్లు ప్రతికూలంగా ముగిశాయి. 137 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.

* క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌ ఇండియా లైసెన్సును రద్దు చేస్తూ సెబీ జారీ చేసిన ఉత్తర్వుల్ని సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (శాట్‌) పక్కనపెట్టింది.

* ట్రాన్సిండియా రియల్‌ ఎస్టేట్‌ లిమిటెడ్‌ హరియాణాలో ఉన్న తమ ఝజ్జార్‌ లాజిస్టిక్స్‌ పార్క్‌ను అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ బ్లాక్‌స్టోన్‌కు రూ.625 కోట్లకు విక్రయించేందుకు సిద్ధమైంది.

* ఐకియో లైటింగ్‌ ఐపీఓ రెండో రోజు ముగిసేసరికి 6.83 రెట్ల స్పందన లభించింది. రూ.606.5 కోట్ల సమీకరణ కోసం 1,52,24,074 షేర్లను     విక్రయించనుండగా, 10,40,31,096 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు