విమాన టికెట్ల ధరలను భారీగా పెంచడం సరికాదు

విమాన టికెట్ల పరంగా ప్రపంచంలోనే అత్యుత్తమ విధానాలను పాటిస్తున్న దేశాల్లో భారత్‌ కూడా ఉందని.. అయితే ఏవైనా పరిస్థితులను అడ్డుపెట్టుకుని టికెట్‌ ధరలను భారీగా పెంచరాదని ఆకాశ ఎయిర్‌ సీఈఓ వినయ్‌ దూబే అభిప్రాయపడ్డారు.

Published : 08 Jun 2023 02:32 IST

ఆకాశ ఎయిర్‌ సీఈఓ

ఇస్తాంబుల్‌: విమాన టికెట్ల పరంగా ప్రపంచంలోనే అత్యుత్తమ విధానాలను పాటిస్తున్న దేశాల్లో భారత్‌ కూడా ఉందని.. అయితే ఏవైనా పరిస్థితులను అడ్డుపెట్టుకుని టికెట్‌ ధరలను భారీగా పెంచరాదని ఆకాశ ఎయిర్‌ సీఈఓ వినయ్‌ దూబే అభిప్రాయపడ్డారు. గోఫస్ట్‌ విమానాలు ఆగిన నేపథ్యంలో, కొన్ని మార్గాల్లో ఇతర విమానాలకు గిరాకీ పెరగడంతో.. విమాన ఛార్జీలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సహేతుక టికెట్‌ ధరల వ్యవస్థ ఉండేలా ఒక యంత్రాంగాన్ని ప్రవేశపెట్టాలని విమానయాన కంపెనీలను కేంద్రం కోరిన విషయం విదితమే. ‘భారత్‌లో సగటు విమాన ధరలు ప్రపంచంలోనే అత్యంత స్నేహపూర్వకంగా ఉన్నాయి. అంతే కాదు.. అత్యుత్తమ విమాన ధరల విధానాలను పాటిస్తున్న దేశాల్లో భారత్‌ ఉంది. అత్యంత తక్కువ సగటు ధరలూ ఇక్కడే ఉన్నాయి. అయితే అసాధారణంగా రేట్లను పెంచడం మంచిది కాదు. రేట్లను భారీగా పెంచకుండా చేసే రోజు రానుంద’ని ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని