మారుతీ జిమ్నీ వచ్చేసింది

దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్పోర్ట్స్‌ వినియోగ వాహనాల (ఎస్‌యూవీ) విభాగంలో 25% మార్కెట్‌ వాటా పొందాలనే లక్ష్యంతో మారుతీ సుజుకీ అడుగులేస్తోంది.

Published : 08 Jun 2023 02:32 IST

ప్రారంభ ధర రూ.12.74 లక్షలు

దిల్లీ: దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్పోర్ట్స్‌ వినియోగ వాహనాల (ఎస్‌యూవీ) విభాగంలో 25% మార్కెట్‌ వాటా పొందాలనే లక్ష్యంతో మారుతీ సుజుకీ అడుగులేస్తోంది. ఇందులో భాగంగానే ‘జిమ్నీ’ మోడల్‌ను దేశీయ విపణిలోకి విడుదల చేసింది. 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌, ఐదు డోర్లు కలిగిన ఈ ఎస్‌యూవీ నెక్సా విక్రయ కేంద్రాల్లో లభించనుంది. 5- స్పీడ్‌ మాన్యువల్‌ మోడళ్లు రూ.12.74-13.85 లక్షల శ్రేణిలో, 4-స్పీడ్‌ ఆటోమేటిక్‌ మోడళ్లు రూ.13.94-15.05 లక్షల శ్రేణిలో లభిస్తాయని కంపెనీ పేర్కొంది. ‘ఐదు డోర్ల జిమ్నీ దేశీయంగా తయారవుతుండటం, ఇక్కడే తొలిసారి విపణిలోకి విడుదల చేస్తుండటం గర్వించదగ్గ పరిణామమ’ని మారుతీ ఎండీ, సీఈఓ హిసాషి టెకూచి పేర్కొన్నారు. ఆటోమేటిక్‌ మోడల్‌ లీటరుకు 16.94 కి.మీ., మాన్యువల్‌ మోడల్‌ లీటరుకు 16.39 కి.మీ. మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. మారుతీ సుజుకీ సబ్‌స్క్రైబ్ ద్వారా కూడా జిమ్నీని పొందవచ్చు. ఇందుకు నెలవారీ చందా రూ.33,550తో ప్రారంభం అవుతుంది. ఇప్పటికే ఎస్‌యూవీ విభాగంలో బ్రెజా, ఫ్రాంక్స్‌, గ్రాండ్‌ విటారా మోడళ్లను మారుతీ సుజుకీ విక్రయిస్తోంది. జపాన్‌కు చెందిన సుజుకీ ఇప్పటికే అంతర్జాతీయ విపణుల్లో 3 డోర్ల జిమ్నీని విక్రయిస్తోంది. 5 డోర్ల వేరియంట్‌ను మారుతీ సుజుకీ అభివృద్ధి చేసి దేశీయంగా విపణిలోకి తీసుకొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు