కీసరలో మేఘా గ్యాస్ 100వ స్టేషన్
ఎంఈఐఎల్ గ్రూపు సంస్థ అయిన మేఘా గ్యాస్, ఈ ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 400 సీఎన్‌జీ స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు 2 లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈనాడు, హైదరాబాద్: ఎంఈఐఎల్ గ్రూపు సంస్థ అయిన మేఘా గ్యాస్, ఈ ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 400 సీఎన్‌జీ స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు 2 లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఈ సంస్థ దేశవ్యాప్తంగా 100 సీఎన్‌జీ స్టేషన్లను నెలకొల్పింది. 100వ సీఎన్‌జీ స్టేషన్‌ను తాజాగా హైదరాబాద్‌లోని కీసర వద్ద ఏర్పాటు చేసింది. ఈ స్టేషన్‌ను మేఘా గ్యాస్ సీఈఓ పి.వెంకటేష్ ప్రారంభించారు. ఇప్పటి వరకు తెలంగాణలో 46, ఆంధ్రప్రదేశ్‌లో 28, కర్ణాటకలో 12, ఉత్తరప్రదేశ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 4, తమిళనాడులో 3, పంజాబ్‌లో 3 సీఎన్‌జీ స్టేషన్లను సంస్థ ఏర్పాటు చేసింది. త్వరలో రాజస్థాన్‌లో సీఎన్‌జీ స్టేషన్లను ప్రారంభించనున్నట్లు మేఘా గ్యాస్ వెల్లడించింది. ఈ స్టేషన్ల నుంచి గృహ, వాణిజ్య అవసరాలకు గ్యాస్ (పీఎన్‌జీ, సీఎన్‌జీ) సరఫరా చేస్తున్నట్లు పేర్కొంది. గ్యాస్ పంపిణీ సేవలను విస్తరించే యత్నాల్లో భాగంగా ఇప్పటి వరకు 3,000 కిలోమీటర్ల పొడవైన పైప్‌లైన్ నిర్మించినట్లు వెంకటేష్ వెల్లడించారు. పైప్‌లైన్‌ను ఇంకా విస్తరిస్తామని, తద్వారా కొత్త స్టేషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Manohar Lal Khattar: బుల్లెట్ నడిపిన సీఎం ఖట్టర్.. వీడియో వైరల్
-
నల్లజాతి బాలికకు మెడల్ ఇవ్వకుండా వివక్ష.. వైరల్ వీడియోతో వెలుగులోకి..!
-
Nara Lokesh: జనం రోడ్డెక్కితే జగన్ జడుసుకుంటున్నారు: నారా లోకేశ్
-
Dream 11: గేమింగ్ కంపెనీలకు షాక్.. ఒక్క డ్రీమ్ 11కే ₹25 వేల కోట్ల పన్ను నోటీసు..!
-
Surya kumar yadav: సూర్య.. ది ఫినిషర్.. ప్రపంచకప్ ముందు మిస్టర్ 360 మెరుపులు
-
Priscilla Chan: 2100 నాటికి అన్ని వ్యాధుల నిర్మూలనే లక్ష్యం : జుకర్‌బర్గ్ ఫౌండేషన్