మహీంద్రా సుప్రో సీఎన్‌జీ డ్యుయో

మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థ చిన్న వాణిజ్య వాహనం సుప్రో సీఎన్‌జీ డ్యుయోను గురువారం విపణిలోకి విడుదల చేసింది. పెట్రోల్‌, సీఎన్‌జీతోనూ ఈ వాహనం నడుస్తుంది.

Published : 09 Jun 2023 02:14 IST

దిల్లీ: మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థ చిన్న వాణిజ్య వాహనం సుప్రో సీఎన్‌జీ డ్యుయోను గురువారం విపణిలోకి విడుదల చేసింది. పెట్రోల్‌, సీఎన్‌జీతోనూ ఈ వాహనం నడుస్తుంది. దీని ధర రూ.6.32 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌). 750 కిలోల వరకు బరువును రవాణా చేసేందుకు అనువైన సుప్రో సీఎన్‌జీ డ్యుయోలో 75 లీటర్ల సామర్థ్యం ఉన్న సీఎన్‌జీ ట్యాంక్‌ ఉంది. దీన్ని పూర్తిగా నింపితే 325 కి.మీ.వరకు ప్రయాణించవచ్చు. 5 లీటర్ల పెట్రోల్‌ ట్యాంక్‌ కూడా ఉంది. గత 4 ఏళ్లలో సీఎన్‌జీ విభాగం నాలుగింతలు వృద్ధి చెందినట్లు ఎంఅండ్‌ఎం ఉపాధ్యక్షుడు బనేశ్వర్‌ బెనర్జీ వెల్లడించారు. సుప్రో సీఎన్‌జీ డ్యుయోతో ఆ మార్కెట్‌ను ఒడిసిపట్టుకోవడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని