వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు లేవు

రూ.2,000 నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవడం లేదా డిపాజిట్‌ చేసే విషయంలో వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావడం లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖల సహాయ మంత్రి సోమ్‌ ప్రకాశ్‌ తెలిపారు.

Published : 09 Jun 2023 02:14 IST

రూ.2000 నోటు మార్చుకునే విషయంపై కేంద్ర మంత్రి సోమ్‌ ప్రకాశ్‌

ఇండోర్‌: రూ.2,000 నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవడం లేదా డిపాజిట్‌ చేసే విషయంలో వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావడం లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖల సహాయ మంత్రి సోమ్‌ ప్రకాశ్‌ తెలిపారు. రూ.2000 నోట్లను మార్చుకునేందుకు/డిపాజిట్‌ చేసేందుకు ప్రజలకు సెప్టెంబరు ఆఖరు వరకు సమయాన్ని ఆర్‌బీఐ ఇచ్చిందని గుర్తు చేశారు.‘నేను చాలా మంది పారిశ్రామికవేత్తలు, వ్యాపారులతో మాట్లాడాను. ఎవరికీ రూ.2000 నోట్ల మార్పిడిలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావడం లేద’ని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలిపారు. నకిలీ బిల్లులను ఉపయోగించి ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను క్లెయిమ్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని