43 నగరాల్లో ఇళ్ల ధరలు పెరిగాయ్‌: ఎన్‌హెచ్‌బీ

గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (జనవరి- మార్చి) దేశంలోని 43 నగరాల్లో ఇళ్ల ధరలు పెరిగాయని నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది.

Updated : 09 Jun 2023 03:11 IST

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (జనవరి- మార్చి) దేశంలోని 43 నగరాల్లో ఇళ్ల ధరలు పెరిగాయని నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. మరో 7 నగరాల్లో తగ్గాయని పేర్కొంది. గృహ రుణ రేట్లు ఇప్పటికీ కొవిడ్‌-19 ముందు స్థాయి కంటే తక్కువగానే ఉన్నాయని పేర్కొంది. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో స్థిరాస్తి ధరలు పెరిగాయని నివేదిక తెలిపింది. అహ్మదాబాద్‌లో 10.8%, బెంగళూరులో 9.4%, చెన్నైలో 6.8%, దిల్లీలో 1.7%, హైదరాబాద్‌లో 7.9 శాతం, కోల్‌కతాలో 11%, ముంబయిలో 3.1 శాతం, పుణెలో 8.2 శాతం మేర స్థిరాస్తి ధరల్లో పెరుగుదల నమోదైందని ఎన్‌హెచ్‌బీ ప్రకటించే హౌసింగ్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ (హెచ్‌పీఐ) ఆధారంగా తెలుస్తోంది. 50 నగరాలకు సంబంధించి స్థిరాస్తి ధరల విలువ పెరుగుదల వివరాలను ఈ సూచీ తెలియజేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని