Fuel Price: ఇంధన ధరల తగ్గింపు ఇప్పట్లో లేనట్లే!

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలపై కంపెనీలకు మార్జిన్లు సానుకూలంగా మారుతున్నాయి.

Updated : 09 Jun 2023 09:40 IST

గత నష్టాలు పూడ్చుకున్నాకే సవరణకు కంపెనీల మొగ్గు

దిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలపై కంపెనీలకు మార్జిన్లు సానుకూలంగా మారుతున్నాయి. అయితే గతేడాది ప్రభుత్వ రంగ చమురు సంస్థలు చవిచూసిన నష్టాలను పూడ్చుకున్న తర్వాతే, భవిష్యత్తులో ఇంధన రిటైల్‌ ధరల తగ్గింపు ఉండొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ గతేడాది ఏప్రిల్‌ నుంచి పెట్రోల్‌, డీజిల్‌కు సంబంధించి రోజువారీ ధరల సవరణను నిలిపివేశాయి. తయారీ వ్యయాలకు అనుగుణంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను నిర్ణయిం     చడమూ ఆపేశాయి. రిటైల్‌ విక్రయ ధరలతో పోలిస్తే, ముడిచమురు ధరలు అధికంగా ఉన్న సమయంలో వాటిల్లిన నష్టాలను.. కంపెనీలు ప్రస్తుతం భర్తీ చేసుకుంటున్నాయి. 2022 అక్టోబరు-డిసెంబరు నుంచి ప్రభుత్వరంగ మూడు చమురు మార్కెటింగ్‌ కంపెనీలు పెట్రోల్‌పై సానుకూల మార్జిన్లు నమోదు చేస్తున్నాయి. డీజిల్‌ విక్రయాలపై ఇంకా లాభాలు రావడం లేదు. గత నెలలో డీజిల్‌పై లీటర్‌కు రూ.0.50 మార్జిన్‌ వచ్చినా.. గతంలో ఏర్పడిన నష్టాలను పూడ్చుకునేందుకు ఈ మొత్తం సరిపోదని అధికారులు వెల్లడించారు.

* రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా 2022 మార్చిలో అంతర్జాతీయంగా ముడిచమురు ధర బ్యారెల్‌కు 139 డాలర్లకు చేరింది. ప్రస్తుతం ఇది 75-76 డాలర్లకు దిగి వచ్చింది. ఒక సమయంలో చమురు కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌ విక్రయంపై రూ.17.4, డీజిల్‌పై రూ.27.7 చొప్పున నష్టపోయాయి. గత అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో లీటర్‌ పెట్రోల్‌పై రూ.10 చొప్పున ఆర్జించినా, డీజిల్‌పై మాత్రం లీటరుకు రూ.6.5 కోల్పోయాయి. 2023 జనవరి-మార్చి త్రైమాసికంలో లీటర్‌ పెట్రోల్‌పై రూ.6.8, డీజిల్‌పై రూ.0.5 మార్జిన్‌ను ఆర్జించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని