మెర్సిడెస్‌ బెంజ్‌ 2 కొత్త కార్లు

జర్మనీకి చెందిన విలాస కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌ తమ ఐకానిక్‌ స్పోర్ట్స్‌ వినియోగ వాహనం (ఎస్‌యూవీ) జీ-క్లాస్‌లో 2 వేరియంట్లను తీసుకొచ్చింది.

Published : 09 Jun 2023 02:18 IST

రూ.2.55 కోట్ల నుంచి

ముంబయి: జర్మనీకి చెందిన విలాస కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌ తమ ఐకానిక్‌ స్పోర్ట్స్‌ వినియోగ వాహనం (ఎస్‌యూవీ) జీ-క్లాస్‌లో 2 వేరియంట్లను తీసుకొచ్చింది. వీటి ధరలు రూ.2.55 కోట్ల నుంచి ప్రారంభమవుతున్నాయి. టాప్‌-ఎండ్‌ విభాగం జీ-క్లాస్‌లో జి400డి అడ్వెంచర్‌ ఎడిషన్‌, జి400డి ఏఎంజీ లైన్‌లను సంస్థ ఆవిష్కరించింది. ఈ ఏడాది పండగ సీజన్‌లో (అక్టోబరు-డిసెంబరు)  ఈ వేరియంట్ల డెలివరీలు ప్రారంభిస్తామని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా తెలిపింది. ఇప్పటికే మెర్సిడెస్‌ బెంజ్‌ కార్లను వినియోగిస్తున్న వారు, తొలుత ఈ కార్లను బుకింగ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తామని కంపెనీ తెలిపింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు