బెయిన్‌ క్యాపిటల్‌ చేతికి హైదరాబాద్‌ కంపెనీ పోరస్‌ ల్యాబ్స్‌

హైదరాబాద్‌కు చెందిన పోరస్‌ ల్యాబ్స్‌ను అమెరికాకు చెందిన ప్రైవేటు ఈక్విటీ సంస్థ బెయిన్‌ క్యాపిటల్‌ కొనుగోలు చేసింది.

Published : 09 Jun 2023 02:18 IST

విలువ రూ.3,000 కోట్లు!

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన పోరస్‌ ల్యాబ్స్‌ను అమెరికాకు చెందిన ప్రైవేటు ఈక్విటీ సంస్థ బెయిన్‌ క్యాపిటల్‌ కొనుగోలు చేసింది. ఒప్పందం విలువ బయటకు రాలేదు కానీ.. ఈ మొత్తం రూ.2,500-3,000 కోట్లు (302-363 మి. డాలర్లు) ఉండొచ్చని ఈ పరిణామాలతో సంబంధమున్న వ్యక్తులను ఉటంకిస్తూ ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. వ్యవసాయ రసాయనాలు, స్పెషాలిటీ కెమికల్స్‌ తయారీ సంస్థ అయిన పోరస్‌ ల్యాబ్స్‌ను 1994లో ఎన్‌.పురుషోత్తమరావు స్థాపించారు. స్పెషాలిటీ పాలిమర్స్‌, ఎలక్ట్రానిక్‌ కెమికల్స్‌, ఆగ్రోకెమికల్స్‌ వంటి విభాగాల్లో ఈ కంపెనీ చురుగ్గా ఉంది. ‘పోరస్‌ ల్యాబ్స్‌ అనుభవం, బలమైన మార్కెట్‌ స్థానాన్ని ఉపయోగించుకుని స్పెషాలిటీ కెమికల్స్‌ కాంట్రాక్ట్‌ అభివృద్ధి, తయారీ రంగంలో మేం ఒక బలమైన ప్లాట్‌ఫారాన్ని నిర్మించగలమ’ని బెయిన్‌ క్యాపిటల్‌లో భాగస్వామి అయిన రిషి మండావత్‌ పేర్కొన్నారు. ‘బెయిన్‌ క్యాపిటల్‌తో ఈ భాగస్వామ్యం ద్వారా మార్కెట్లో మాకున్న సత్తాను మరింత సామర్థ్యంతో చూపించగలమన్న విశ్వాసం మాకుంద’ని పోరస్‌ ల్యాబ్స్‌ సీఈఓ శ్రీనివాసన్‌ నామాల పేర్కొన్నారు. 2021-22లో పోరస్‌ ల్యాబ్స్‌ రూ.806.7 కోట్ల నికర అమ్మకాలను నమోదు చేసింది. 2020-21లో నమోదైన రూ.678.4 కోట్లతో పోలిస్తే ఇవి 19 శాతం అధికం. ఇదే సమయంలో ఎబిటా 97 శాతం పెరిగి రూ.241.6 కోట్లకు చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని