విండోస్‌ పాత వర్షన్‌లో గూగుల్‌ డ్రైవ్‌ పనిచేయదిక!

మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా యూజర్లకు మెరుగైన సేవలు అందిచాలనే ఉద్దేశంతో గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 2023 నుంచి విండోస్‌ (32-బిట్‌ వెర్షన్‌) ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఉపయోగిస్తున్న యూజర్లకు గూగుల్‌ డ్రైవ్‌ సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.

Published : 10 Jun 2023 02:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా యూజర్లకు మెరుగైన సేవలు అందిచాలనే ఉద్దేశంతో గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 2023 నుంచి విండోస్‌ (32-బిట్‌ వెర్షన్‌) ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఉపయోగిస్తున్న యూజర్లకు గూగుల్‌ డ్రైవ్‌ సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా విండోస్‌ 8, విండోస్‌ 8.1, విండోస్‌ సర్వర్‌ 2012 యూజర్లకు ఇకపై గూగుల్‌ డ్రైవ్‌ సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. ప్రస్తుతం విండోస్‌ 8 (32-బిట్‌ వెర్షన్‌) ఓఎస్‌ ఉపయోగిస్తున్న యూజర్లు తమ కంప్యూటర్లలో ఓఎస్‌ను విండోస్‌ 10 (64-బిట్‌ వెర్షన్‌)కు అప్‌గ్రేడ్‌ చేసుకోవాలని సూచించింది. అయితే, గూగుల్‌ బ్రౌజర్‌ ద్వారా యూజర్లు డ్రైవ్‌ను యాక్సెస్‌ చేసుకోవచ్చని తెలిపింది. సైబర్‌ దాడులు, యూజర్‌ డేటా భద్రత వంటి వాటి దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు