దేశ వృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలది కీలక పాత్ర

దేశ ఆర్థిక వృద్ధి ప్రస్తుత 7 శాతం నుంచి కనీసం 10 శాతానికి చేరితేనే తలసరి ఆదాయం పెరుగుతుందని నీతి ఆయోగ్‌ మాజీ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ అంటున్నారు.

Published : 10 Jun 2023 02:39 IST

నీతి ఆయోగ్‌ మాజీ సీఈఓ అమితాబ్‌ కాంత్‌

చెన్నై: దేశ ఆర్థిక వృద్ధి ప్రస్తుత 7 శాతం నుంచి కనీసం 10 శాతానికి చేరితేనే తలసరి ఆదాయం పెరుగుతుందని నీతి ఆయోగ్‌ మాజీ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ అంటున్నారు. సమ్మిళిత (కాంపౌండింగ్‌) వృద్ధి రేటు చాలా శక్తిమంతమైందని, భారత వృద్ధి 9 శాతం నమోదైతే తలసరి ఆదాయం 20,000 డాలర్ల (రూ.16,40,000)కు, 10 శాతం చొప్పున నమోదైతే 30,000 డాలర్ల (రూ.24,60,000)కు చేరుతుందని పేర్కొన్నారు. ‘ప్రస్తుత 7 శాతం నుంచి 10 శాతానికి వృద్ధి చేరాలంటే దేశంలోని ప్రతి రాష్ట్రం కూడా ఛాంపియన్‌లా అవతరించాలి. కనీసం 10-12 రాష్ట్రాలు 10 శాతానికి పైగా వృద్ధి నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంద’ని భారత పరిశ్రమ సమాఖ్య దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశంలో అమితాబ్‌ కాంత్‌ వెల్లడించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు