కొత్త విమానాల కోసం తక్కువ సమయంలో భారీ రుణ ఒప్పందం

కొత్త విమానాలకు సంబంధించి తమ బృందాలన్నీ కలిసికట్టుగా తక్కువ సమయంలోనే భారీ రుణ ఒప్పందాన్ని పూర్తి చేశాయని ఎయిరిండియా సీఈఓ క్యాంప్‌బెల్‌ విల్సన్‌ తెలిపారు.

Published : 10 Jun 2023 02:39 IST

ఎయిరిండియా సీఈఓ

దిల్లీ: కొత్త విమానాలకు సంబంధించి తమ బృందాలన్నీ కలిసికట్టుగా తక్కువ సమయంలోనే భారీ రుణ ఒప్పందాన్ని పూర్తి చేశాయని ఎయిరిండియా సీఈఓ క్యాంప్‌బెల్‌ విల్సన్‌ తెలిపారు. కొత్త ఎయిరిండియాకు ఇది మరో ఘనతగా ఆయన అభివర్ణించారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలను క్యాంప్‌బెల్‌ వెల్లడించలేదు. ఎయిర్‌బస్‌ నుంచి 250, బోయింగ్‌ నుంచి 220 చొప్పున మొత్తంగా 470 విమానాల కొనుగోలు చేయనున్నట్లు ఫిబ్రవరి 15న ఎయిరిండియా ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటితో పాటు ఈ రెండు విమాన తయారీ సంస్థల నుంచి మరో 370 విమానాల కొనుగోలు అవకాశాన్ని కూడా అట్టేపెట్టుకున్నట్లు పేర్కొంది. గత 17 ఏళ్లలో కొత్త విమానాల కోసం ఆర్డర్లు ఇవ్వడం ఎయిరిండియాకు ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని