ఫండ్లలో తగ్గిన నికర పెట్టుబడులు

స్టాక్‌ మార్కెట్‌ సూచీలు పుంజుకోవడంతో ఫండ్‌ మదుపరులు గత నెలలో లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలోకి మే నెలలో నికరంగా రూ.3,240 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

Published : 10 Jun 2023 02:39 IST

ఈనాడు, హైదరాబాద్‌: స్టాక్‌ మార్కెట్‌ సూచీలు పుంజుకోవడంతో ఫండ్‌ మదుపరులు గత నెలలో లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలోకి మే నెలలో నికరంగా రూ.3,240 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గత అయిదు నెలల కాలంలో ఇదే కనిష్ఠం. ఏప్రిల్‌లో రూ.6,480 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అయినప్పటికీ వరుసగా 27 నెలల నుంచీ నికర పెట్టుబడులు అధికంగానే ఉన్నాయని భారతీయ మ్యూచువల్‌ ఫండ్ల సంఘం(యాంఫీ) శుక్రవారం వెల్లడించింది. క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారా రూ.14,749 కోట్లు మార్కెట్లోకి వచ్చాయి. ఇది జీవిత కాల గరిష్ఠం. ఏప్రిల్‌లో ఈ మొత్తం రూ.13,728 కోట్లుగా ఉంది. మొత్తం 42 మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ.43.2 లక్షల కోట్లకు చేరుకుంది. మార్కెట్లో అనిశ్చితి కొనసాగుతున్నా ఫండ్లలోకి నికర పెట్టుబడులు సానుకూలంగానే ఉన్నాయని యాంఫీ సీఈఓ ఎన్‌ వెంకటేశ్‌ తెలిపారు. మేలో లాభాల స్వీకరణ, పిల్లల చదువుల ఖర్చులు, విహార యాత్రలు తదితర కారణాల వల్ల పెట్టుబడులు కాస్త తగ్గినట్లు ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు