మార్కెట్లోకి మారుతీ సుజుకీ టూర్‌ హెచ్‌1...ప్రారంభ ధర రూ.4.8 లక్షలు

మారుతీ సుజుకీ ఇండియా ప్రారంభ స్థాయి వాణిజ్య హ్యాచ్‌బ్యాక్‌ మోడల్‌ ‘టూర్‌ హెచ్‌1’ను విపణిలోకి విడుదల చేసింది. ప్రారంభ ధరను రూ.4.8 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ దిల్లీ)గా నిర్ణయించారు.

Updated : 10 Jun 2023 05:48 IST

 

దిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా ప్రారంభ స్థాయి వాణిజ్య హ్యాచ్‌బ్యాక్‌ మోడల్‌ ‘టూర్‌ హెచ్‌1’ను విపణిలోకి విడుదల చేసింది. ప్రారంభ ధరను రూ.4.8 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ దిల్లీ)గా నిర్ణయించారు. కొత్త తరం ఆల్టో కే10 ఆధారంగా రూపొందించిన ఈ మోడల్‌ సీఎన్‌జీ వేరియంట్‌ ధర రూ.5.7 లక్షలుగా ఉంది. ఇందులో  1-లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను అమర్చారు. వాణిజ్య విభాగం కోసం ప్రత్యేకంగా టూర్‌ హెచ్‌1ను తయారు చేశామని, కొత్త తరం కే 10సీ ఇంజిన్‌తో మరింత సదుపాయం, భద్రతా ఫీచర్లు లభిస్తాయని మారుతీ సుజుకీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌(మార్కెటింగ్‌, అమ్మకాలు) శశాంక్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు. పెట్రోల్‌ వెర్షన్‌ లీటర్‌కు 24.60 కి.మీ మైలేజీ, ఎస్‌-సీఎన్‌జీ వేరియంట్‌ కేజీకి 34.46 కి.మీ మైలేజీ ఇస్తాయని తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని