షియోమీ సహా 3 విదేశీ బ్యాంకులకు ఈడీ నోటీసులు

చైనాకు చెందిన మొబైల్‌ తయారీ కంపెనీ షియోమీ సహా ఆ సంస్థ ముఖ్య ఆర్థిక అధికారి, డైరెక్టర్‌ సమీర్‌ రావు, మాజీ ఎండీ మను జైన్‌, 3 విదేశీ బ్యాంకులకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

Published : 10 Jun 2023 02:43 IST

రూ.5,551 కోట్ల ఫెమా ఉల్లంఘన కేసులో..

దిల్లీ: చైనాకు చెందిన మొబైల్‌ తయారీ కంపెనీ షియోమీ సహా ఆ సంస్థ ముఖ్య ఆర్థిక అధికారి, డైరెక్టర్‌ సమీర్‌ రావు, మాజీ ఎండీ మను జైన్‌, 3 విదేశీ బ్యాంకులకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. రూ.5,551 కోట్ల ఫెమా (విదేశీ మారకపు నిర్వహణ చట్టం) ఉల్లంఘనలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఈడీ ఈ చర్యలకు ఉపక్రమించింది. సిటీ బ్యాంక్‌, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్‌, డాయిష్‌ బ్యాంక్‌ ఏజీలు నోటీసులు అందుకున్న బ్యాంకుల జాబితాలో ఉన్నాయని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. షియోమీ టెక్నాలజీ ఇండియా ప్రై.లి.కు చెందిన రూ.5,551.27 కోట్ల నిధులను జప్తు చేసినట్లు పేర్కొంది. విదేశాల్లో రాయల్టీ ముసుగులో అనధీకృత రెమిటెన్స్‌ల ద్వారా ఆయా బ్యాంకుల ఖాతాల్లో నగదు జమ అయ్యిందని వివరించింది. ఫెమా చట్టంలోని 37ఎ సెక్షన్‌ కింద జప్తు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఈడీ వెల్లడించింది. ఫెమా చట్టం కింద ఈడీ దర్యాప్తు పూర్తయిన తర్వాత షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తుంది. ఇది పరిష్కారమైన తర్వాత నిందితులు అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు