Credit Card: విదేశాల్లో క్రెడిట్‌ కార్డు లావాదేవీలకు టీసీఎస్‌పై త్వరలోనే స్పష్టత: ఆర్థిక శాఖ

విదేశాల్లో క్రెడిట్‌ కార్డు లావాదేవీలను నిర్వహించినప్పుడు వర్తించే మూలం వద్ద పన్ను వసూల (టీసీఎస్‌) నిబంధనలపై త్వరలోనే పూర్తి స్పష్టత ఇవ్వనున్నట్లు ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి(ట్యాక్స్‌ పాలసీ, లెజిస్లేషన్‌) రామన్‌ చోప్రా తెలిపారు.

Updated : 10 Jun 2023 07:39 IST

లఖ్‌నవూ: విదేశాల్లో క్రెడిట్‌ కార్డు లావాదేవీలను నిర్వహించినప్పుడు వర్తించే మూలం వద్ద పన్ను వసూల (టీసీఎస్‌) నిబంధనలపై త్వరలోనే పూర్తి స్పష్టత ఇవ్వనున్నట్లు ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి(ట్యాక్స్‌ పాలసీ, లెజిస్లేషన్‌) రామన్‌ చోప్రా తెలిపారు. జులై 1 నుంచి విదేశాల్లో క్రెడిట్‌ కార్డు లావాదేవీలు చేసినప్పుడు 20 శాతం టీసీఎస్‌ విధించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై విమర్శలు రావడంతో రూ.7 లక్షల వరకూ మినహాయింపునిచ్చింది. అయినప్పటికీ ఎన్నో అనుమానాలున్న నేపథ్యంలో మరింత స్పష్టత ఇస్తామని ఆర్థిక శాఖ పేర్కొంది. శుక్రవారం సీఐఐ సమావేశంలో చోప్రా మాట్లాడుతూ.. కొత్త నిబంధనలపై ఆర్థిక మంత్రి విస్తృతంగా చర్చిస్తున్నారని, వీటిపై పూర్తి స్పష్టతను ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. టీసీఎస్‌ ఎంత విధించాలి, ఎంత పరిమితి వరకూ మినహాయించాలి, ఏయే లావాదేవీలపై పన్ను వర్తించదు తదితరాలన్నీ తెలుస్తాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని