పట్టణ సహకార బ్యాంకుల బలోపేతానికి 4 కీలక చర్యలు
1,514 పట్టణ సహకార బ్యాంకుల (యూసీబీ)ను బలోపేతం చేసే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నాలుగు కీలక చర్యలను నోటిఫై చేసిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
నోటిఫై చేసిన ఆర్‌బీఐ
దిల్లీ: 1,514 పట్టణ సహకార బ్యాంకుల (యూసీబీ)ను బలోపేతం చేసే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నాలుగు కీలక చర్యలను నోటిఫై చేసిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ‘కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్‌బీఐ గవర్నరు శక్తికాంత దాస్‌ల మధ్య విస్తృత సంప్రదింపుల అనంతరం ఆర్‌బీఐ ఈ చర్యలను నోటిఫై చేసింద’ని కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ నాలుగు చర్యల్లో... ప్రాధాన్య రంగాలకు రుణాల మంజూరు లక్ష్యాన్ని సాధించేందుకు యూసీబీలకు అదనంగా మరో రెండేళ్ల సమయం ఇవ్వడం ఒకటి. అలాగే కార్యకలాపాలకు అనుమతి ఉన్న ప్రాంతాల్లో ఆర్‌బీఐ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న శాఖల సంఖ్యల్లో 10 శాతం వరకు (గరిష్ఠంగా 5 శాఖలు) కొత్త శాఖలను పట్టణ సహకార బ్యాంకులు ప్రారంభించవవచ్చు. అయితే బోర్డు నుంచి విధానపరమైన అనుమతులు పొందడంతో పాటు ఫైనాన్షియల్లీ సౌండ్ అండ్ వెల్ మేనేజ్డ్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి. వాణిజ్య బ్యాంకుల మాదిరి వన్-టైం సెటిల్‌మెంట్ చేసే అవకాశాన్ని కూడా యూసీబీలకు ఆర్‌బీఐ కల్పించింది. అలాగే బోర్డు ఆమోదిత విధానాల ద్వారా రుణ గ్రహీతలకు సాంకేతిక రైటాఫ్(రుణాల రద్దు), సెటిల్‌మెంట్ ప్రక్రియను కూడా పట్టణ సహకార బ్యాంకులు చేపట్టొచ్చు. తాజాగా ఆర్‌బీఐ నోటిఫై చేసిన చర్యల ప్రకారం.. ప్రాధాన్య రంగ రుణాల లక్ష్యాన్ని సాధించేందుకు యూసీబీలకు 2026 మార్చి 31 వరకు గడువు ఇవ్వాలని ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. అలాగే 60 శాతం మేర లక్ష్యాన్ని సాధించేందుకు గడువును కూడా 2024 మార్చి 31 వరకు గడువు పొడిగించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.