ఎఫ్‌ఎమ్‌సీజీ, ఐటీ షేర్లు డీలా

ఎఫ్‌ఎమ్‌సీజీ, ఐటీ, టెక్‌ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో వరుసగా రెండో రోజూ సెన్సెక్స్‌, నిఫ్టీ నష్టపోయాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు డీలాపడటం నష్టాలకు కారణమైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 4 పైసలు పెరిగి 82.47 వద్ద ముగిసింది.

Updated : 10 Jun 2023 05:47 IST

సమీక్ష

ఎఫ్‌ఎమ్‌సీజీ, ఐటీ, టెక్‌ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో వరుసగా రెండో రోజూ సెన్సెక్స్‌, నిఫ్టీ నష్టపోయాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు డీలాపడటం నష్టాలకు కారణమైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 4 పైసలు పెరిగి 82.47 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.38% లాభంతో 76.25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఐరోపా సూచీలు నీరసపడ్డాయి.

సెన్సెక్స్‌ ఉదయం 62,810.68 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభమైంది. ఆరంభ ట్రేడింగ్‌లో 62,992.16 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. అనంతరం నష్టాల్లోకి జారుకుంది. ఒకదశలో 62,594.74 వద్ద కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్‌, చివరకు 223.01 పాయింట్ల నష్టంతో 62,625.63 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 71.15 పాయింట్లు కోల్పోయి 18,563.40 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 18,555.40- 18,676.65 పాయింట్ల మధ్య కదలాడింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 19 డీలాపడ్డాయి. టాటా స్టీల్‌ 1.98%, ఎస్‌బీఐ 1.68%, హెచ్‌యూఎల్‌ 1.65%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.48%, ఇన్ఫోసిస్‌ 1.33%, ఐటీసీ 0.99%, ఏషియన్‌ పెయింట్స్‌ 0.95%, ఎం అండ్‌ ఎం 0.82%, టీసీఎస్‌ 0.79% చొప్పున నష్టపోయాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, పవర్‌గ్రిడ్‌, అల్ట్రాటెక్‌, టాటా మోటార్స్‌ 2.12% వరకు లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో ఎఫ్‌ఎమ్‌సీజీ 0.82%, టెక్‌ 0.79%, ఐటీ 0.68%, లోహ 0.66%, కమొడిటీస్‌ 0.58%, మన్నికైన వినిమయ వస్తువులు 0.58% మేర తగ్గాయి. పరిశ్రమలు, టెలికాం, యుటిలిటీస్‌, యంత్ర పరికరాలు మెరిశాయి. బీఎస్‌ఈలో 1862 షేర్లు నష్టాల్లో ముగియగా, 1679 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 107 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.

* సస్టెయినబుల్‌ కన్వెర్జ్‌ పాలీయల్స్‌ టెక్నాలజీ వినియోగం నిమిత్తం సౌదీ అరామ్‌కో టెక్నాలజీస్‌ కంపెనీతో లైసెన్స్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు స్పెషాలిటీ రసాయనాల సంస్థ ఏథెర్‌ ఇండస్ట్రీస్‌ వెల్లడించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు