డిజిటల్‌ చెల్లింపుల్లో భారత్‌దే అగ్రస్థానం

రియల్‌టైమ్‌ డిజిటల్‌ చెల్లింపులపరంగా ప్రపంచంలోనే భారత్‌ది అగ్రస్థానమని మైగవ్‌ ఇండియా గణాంకాలు పేర్కొంటున్నాయి.

Updated : 11 Jun 2023 03:16 IST

2022లో 8950 కోట్ల లావాదేవీలు

దిల్లీ: రియల్‌టైమ్‌ డిజిటల్‌ చెల్లింపులపరంగా ప్రపంచంలోనే భారత్‌ది అగ్రస్థానమని మైగవ్‌ ఇండియా గణాంకాలు పేర్కొంటున్నాయి. 2022లో మొత్తంగా భారత్‌లో 8950 కోట్ల (89.5 బిలియన్‌) లావాదేవీలు జరిగాయని సమాచారం. ప్రపంచ మొత్తం మీద జరిగిన డిజిటల్‌ ఆర్థిక లావాదేవీల్లో భారత్‌ వాటా 46 శాతం కావడం గమనార్హం. భారత్‌ తర్వాతి నాలుగు స్థానాల్లో ఉన్న దేశాల్లో జరిగిన మొత్తం డిజిటల్‌ లావాదేవీలన్నీ కలిపినా ఇంతకంటే తక్కువగానే ఉన్నాయి. లావాదేవీల సంఖ్యాపరంగానే కాదు విలువపరంగా కూడా కొత్త మైలురాళ్లను భారత్‌ అందుకుందని ఆర్‌బీఐ నిపుణుల ప్రకటనలను ఉటంకిస్తూ ఒక వార్తా సంస్థ వెల్లడించింది. భారత్‌లో చెల్లింపుల వ్యవస్థ సమర్థతను, దేశంలో డిజిటల్‌కు పెరుగుతున్న ఆదరణను ఇది తెలియజేస్తోందని వాళ్లు అభిప్రాయపడినట్లు పేర్కొంది. డిజిటల్‌ చెల్లింపుల్లో బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉంది. ఈ దేశంలో గతేడాది 29.2 బిలియన్‌ డిజిటల్‌ లావాదేవీలు జరిగాయి. ఆ తర్వాతి స్థానాల్లో చైనా, థాయ్‌లాండ్‌, దక్షిణ కొరియా ఉన్నాయని మైగవ్‌ ఇండియా గణాంకాలు చెబుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని