ఫండ్స్‌, ఏఎమ్‌సీలు, ట్రస్టీలపై ఫోరెన్సిక్‌ దర్యాప్తు!

ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ ఎల్‌ఎల్‌పీ, డెలాయిటీ టాచ్‌ టొమాత్సు ఇండియా ఎల్‌ఎల్‌పీ, గ్రాంట్‌ థార్న్‌టన్‌ భారత్‌ ఎల్‌ఎల్‌పీ వంటి 34 సంస్థలతో సెబీ ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది.

Published : 23 Sep 2023 01:38 IST

34 సంస్థలతో బృందాన్ని ఏర్పాటు చేసిన సెబీ

దిల్లీ: ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ ఎల్‌ఎల్‌పీ, డెలాయిటీ టాచ్‌ టొమాత్సు ఇండియా ఎల్‌ఎల్‌పీ, గ్రాంట్‌ థార్న్‌టన్‌ భారత్‌ ఎల్‌ఎల్‌పీ వంటి 34 సంస్థలతో సెబీ ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. మ్యూచువల్‌ ఫండ్‌లు, వాటి ఆస్తుల నిర్వహణ కంపెనీ(ఏఎమ్‌సీ)లు, ట్రస్టీలపై ఫోరెన్సిక్‌ దర్యాప్తులను నిర్వహించడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. కేపీఎమ్‌జీ అసూరెన్స్‌ అండ్‌ కన్సల్టింగ్‌ సర్వీసెస్‌ ఎల్‌ఎల్‌పీ, ఛోక్సి అండ్‌ ఛోక్సి ఎల్‌ఎల్‌పీ, నాంగియా అండ్‌ కో ఎల్‌ఎల్‌పీ, పిపారా అండ్‌ కో ఎల్‌ఎల్‌పీ వంటి ఇతర సంస్థలు సైతం ఈ జాబితాలో ఉన్నాయని మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ వెలువరచిన సమాచారంలో ఉంది. ఈ బృందానికి సెప్టెంబరు 20, 2023 నుంచి సెప్టెంబరు 19, 2026 వరకు అంటే మూడేళ్ల పాటు కాల వ్యవధి ఉంటుంది. ఫిబ్రవరిలో సెబీ ప్రకటించిన ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ)కు స్పందనగా వచ్చిన అన్ని దరఖాస్తుల పరిశీలన అనంతరం ఈ 34 సంస్థలను సెబీ ఎంపిక చేసింది. ఈ సంస్థలు మొబైల్‌, కంప్యూటర్లు, టాబ్లెట్లు, హార్డ్‌ డ్రైవ్‌లు, యూఎస్‌బీ డ్రైవ్‌ వంటి డిజిటల్‌ సాక్ష్యాధారాలను పొందడంతో పాటు వాటిని విశ్లేషించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక నివేదికను సిద్ధం చేసి ఇవ్వాల్సి ఉంటుంది. యూనిట్‌హోల్డర్ల ప్రయోజనాలను కాపాడేందు కోసం ఫండ్‌ ట్రస్టీల పాత్ర, బాధ్యతను సెబీ జులైలో పెంచిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు