యూట్యూబ్‌లో వీడియో ఎడిటింగ్‌కు ఉచిత యాప్‌

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌ తన వీడియో క్రియేటర్లకు శుభవార్త చెప్పింది. వీడియోలను సులువుగా రూపొందించుకునేలా ‘యూట్యూబ్‌ క్రియేట్‌’ పేరిట కొత్త యాప్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

Updated : 23 Sep 2023 07:14 IST

ప్రస్తుతానికి ఆండ్రాయిడ్‌ వినియోగదార్లకే
వచ్చే ఏడాది యాపిల్‌లోనూ

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌ తన వీడియో క్రియేటర్లకు శుభవార్త చెప్పింది. వీడియోలను సులువుగా రూపొందించుకునేలా ‘యూట్యూబ్‌ క్రియేట్‌’ పేరిట కొత్త యాప్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. అలాగే కృత్రిమ మేధ(ఏఐ) ఆధారంగా రూపొందించిన డ్రీమ్‌ సీన్‌  ఫీచర్‌ను కూడా టెస్ట్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. దీని సాయంతో షార్ట్‌ వీడియోలకు ఏఐ ఆధారంగా రూపొందించిన వీడియోలు, బ్యాక్‌గ్రౌండ్‌లో ఇమేజ్‌లు జోడించటానికి వీలుంటుంది.

కొత్త జనరేటివ్‌ ఏఐ ఆధారిత యాప్‌లో ఎడిటింగ్‌ ట్రిమ్మింగ్‌, ఆటోమేటిక్‌ క్యాప్షనింగ్‌, వాయిస్‌ ఓవర్‌, ట్రాన్సిషన్స్‌ వంటి ఫీచర్లు ఉంటాయి. టిక్‌టాక్‌ మాదిరిగానే బీట్‌-మ్యాచింగ్‌ టెక్నాలజీతో ఉండే రాయల్టీ ఫ్రీ మ్యూజిక్‌ను వినియోగదారులు వాడుకోవచ్చు. ‘ఎవరైనా వీడియోలను క్రియేట్‌ చేయాలన్నా, షేర్‌ చేయాలన్నా సులువుగా ఉండేందుకు ఈ అప్లికేషన్‌ను అభివృద్ధి చేశాం. షార్ట్‌, లాంగ్‌ వీడియోలను రూపొందించడానికి దీన్ని తీసుకొచ్చాం’ అని యూట్యూబ్‌ కమ్యూనిటీ ప్రోడక్ట్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ టోనీ తెలిపారు. ఇదో ఉచిత యాప్‌. ప్రస్తుతం భారతదేశం, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, ఇండోనేషియా, కొరియా, సింగపూర్‌తో సహా ఎంపిక చేసిన మార్కెట్లలో ఆండ్రాయిడ్‌లో బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. వచ్చే ఏడాది ఐఫోన్‌లో ఈ యాప్‌ను ప్రవేశపెడతామని యూట్యూబ్‌ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని