ఐఫోనా.. మజాకా..

టెక్‌ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఐఫోన్‌ 15 అమ్మకాలు భారత్‌లో మొదలయ్యాయి. దేశంలోని రెండు స్టోర్ల ముందు జనాల సందడి కనిపించింది.

Updated : 23 Sep 2023 07:23 IST

భారత్‌లో కొనుగోళ్లు ప్రారంభం
స్టోర్ల ముందు బారులు తీరిన టెక్‌ ప్రియులు

టెక్‌ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఐఫోన్‌ 15 అమ్మకాలు భారత్‌లో మొదలయ్యాయి. దేశంలోని రెండు స్టోర్ల ముందు జనాల సందడి కనిపించింది. శుక్రవారం ఉదయం అమ్మకాలు మొదలుపెట్టగా.. వీటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. ఓ వైపు ముంబయిలోని బీకేసీ వద్ద ఉన్న యాపిల్‌ స్టోర్‌ వద్ద, మరోవైపు దేశ రాజధాని దిల్లీ సాకేత్‌లోని రెండో స్టోర్‌ వద్ద సందడి వాతావరణం నెలకొంది. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే ప్రజలు వరుసల్లో నిలబడ్డారు. భారత్‌లో తొలి ఐఫోన్‌ 15 కోనుగోలు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు కొనుగోలుదారుడు రాహుల్‌. ‘భారత్‌లో తొలి ఐఫోన్‌ 15 కొనుగోలు చేయడం ఆనందంగా ఉంది. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి లైన్‌లో నిలబడ్డాను. ఇప్పటికే విడుదలైన ఐఫోన్‌ 13 ప్రో మాక్స్‌, ఐఫోన్‌ 14 ప్రో మాక్స్‌ నా వద్ద ఉన్నాయి. తాజాగా ఐఫోన్‌ 15 విడుదల కావడం వల్ల ఆ ఫోన్‌ కోసం వచ్చాను.’ అని చెప్పాడు. సెప్టెంబర్‌ 12న అమెరికా కాలిఫోర్నియాలోని యాపిల్‌ ప్రధాన కార్యాలయంలో అత్యంత అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఐఫోన్‌ 15 సిరీస్‌ ఫోన్లను, యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 9, వాచ్‌ అల్ట్రా 2లను యాపిల్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఫోన్‌ 14 సిరీస్‌ మొదటి రోజు విక్రయాలతో పోలిస్తే యాపిల్‌ తాజా ఐఫోన్‌ 15 సిరీస్‌ విక్రయాలు 100 శాతం వృద్ధి నమోదుచేసినట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. భారత్‌లో తయారైన ఈ మోడళ్లకు అధిక గిరాకీ లభిస్తోందని తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు