పండగల సీజన్‌లో కొనుగోళ్ల జోరు

రాబోయే పండగల సీజన్‌లో ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు వినియోగదార్లు మొగ్గుచూపుతున్నారని అమెజాన్‌ ఇండియా-నీల్సన్‌ మీడియా సర్వే వెల్లడించింది.

Published : 26 Sep 2023 02:07 IST

ఆన్‌లైన్‌లోనే అధికం
అమెజాన్‌-నీల్సన్‌ సర్వే

దిల్లీ: రాబోయే పండగల సీజన్‌లో ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు వినియోగదార్లు మొగ్గుచూపుతున్నారని అమెజాన్‌ ఇండియా-నీల్సన్‌ మీడియా సర్వే వెల్లడించింది. దేశంలోని మెట్రో, చిన్న నగరాల్లో 8,159 మంది వినియోగదారులతో సర్వే నిర్వహించారు. వచ్చే పండగల సీజన్‌లో ఆన్‌లైన్‌ కొనుగోళ్లు చేయనున్నట్లు మెట్రో నగరాల్లో 87% మంది, ద్వితీయ శ్రేణి నగరాల్లో (10-40 లక్షల జనాభా) 86% మంది వినియోగదారులు వెల్లడించారు. ఆన్‌లైన్‌లో షాపింగ్‌కు 81% మంది కొనుగోలుదార్లు ఉత్సాహం చూపగా, గతేడాదితో పోలిస్తే వ్యయాలు పెంచేందుకు ప్రతి ఇద్దరులో ఒకరు మొగ్గు చూపుతున్నట్లు సర్వే స్పష్టం చేసింది.  

  • భారీ గృహోపకరణాలను కొనుగోలు చేయడానికి నలుగురులో ముగ్గురు కొనుగోలుదార్లు ఆన్‌లైన్‌ పండగల విక్రయాల కోసం ఎదురుచూస్తున్నట్లు నీల్సన్‌ మీడియా సర్వే తెలిపింది. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్లు, గీజర్లు, ఏసీలు వంటి వాటిల్లో కొత్త బ్రాండ్‌లు, ఉత్పత్తులతో పాటు ఆఫర్లు లభిస్తాయని వినియోగదారులు భావిస్తున్నారు.
  • స్మార్ట్‌ఫోన్‌లు కొనుగోలు చేయడం కోసం 76 శాతం మంది కొనుగోలుదార్లు పండగ విక్రయాలు కోసం చూస్తున్నారు. రూ.10,000-20,000 ధరల శ్రేణి ఫోన్‌లకు దాదాపు 60% మంది ఆసక్తి చూపగా.. ప్రతి ముగ్గురిలో ఇద్దరు 5జీ ఫీచర్లు కోరుకుంటున్నారు.
  • విలాస, ప్రత్యేకమైన సౌందర్య ఉత్పత్తులను కొనుగోలు చేయాలని 76 శాతం మంది భారతీయులు అనుకుంటున్నారు. నాణ్యమైన, అసలైన సౌందర్య ఉత్పత్తులను పండగల విక్రయాల్లో సంస్థలు అందిస్తాయని 74 శాతం మంది విశ్వాసం వ్యక్తం చేశారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని