విద్యుత్‌ వాహన అమ్మకాల్లో తమిళనాడుకు అగ్రస్థానం

దేశంలో విద్యుత్‌ వాహనాల(ఈవీ)కు ఆదరణ పెరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటికే దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా ఈవీలు అమ్ముడవ్వగా..

Updated : 26 Sep 2023 09:55 IST

40% అమ్మకాలు ఈ రాష్ట్రంలోనే..

చెన్నై: దేశంలో విద్యుత్‌ వాహనాల(ఈవీ)కు ఆదరణ పెరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటికే దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా ఈవీలు అమ్ముడవ్వగా.. అందులో అత్యధిక విక్రయాలతో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలను ఉటంకిస్తూ తమిళనాడు ప్రభుత్వం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు దేశవ్యాప్తంగా 10,44,600 విద్యుత్‌ వాహనాలు రిజిస్టర్‌ అయినట్లు గణాంకాలు పేర్కొన్నాయి. ఇందులో 4,14,802 వాహనాలు ఒక తమిళనాడులోనే తయారవడం విశేషం. ఇందులో అత్యధికంగా ఓలా ఎలక్టిక్ర్‌ వాహనాలు 1.75 లక్షలు కాగా.. టీవీఎస్‌ మోటార్‌కు చెందిన 1.12 లక్షల వాహనాలు ఉన్నాయి. అత్యధికంగా చెన్నై, కోయంబత్తూర్‌, తిరుచిరాపల్లి, మధురై, సేలం ప్రాంతాల్లో ఈవీల విక్రయాలు గణనీయంగా పెరిగినట్లు తమిళనాడు సర్కారు ఓ అధికారిక ప్రకటనలో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని