1 నుంచి హ్యుందాయ్‌ ధరల పెంపు

వాహన తయారీ సంస్థ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా (హెచ్‌ఎమ్‌ఐఎల్‌), జనవరి 1 నుంచి ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. పెరిగిన ముడి పదార్థాల ధరలు, ప్రతికూల మారకపు రేటు, అధిక కమొడిటీ ధరల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Updated : 08 Dec 2023 02:47 IST

దిల్లీ: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా (హెచ్‌ఎమ్‌ఐఎల్‌), జనవరి 1 నుంచి ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. పెరిగిన ముడి పదార్థాల ధరలు, ప్రతికూల మారకపు రేటు, అధిక కమొడిటీ ధరల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ కంపెనీ గ్రాండ్‌ ఐ10 నియోస్‌ నుంచి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ అయానిక్‌5 వరకు మోడళ్లను రూ.5.84 లక్షల నుంచి రూ.45.95 లక్షల ధరల్లో విక్రయిస్తోంది.  ధరలను ఎంత మేర పెంచనున్నదీ కంపెనీ స్పష్టం చేయలేదు.

డుకాటీ ధరలు సైతం: జనవరి 1 నుంచి తమ బైక్‌ల ధరలను పెంచుతున్నట్లు ఇటలీకి చెందిన సూపర్‌బైక్‌ తయారీ కంపెనీ డుకాటీ ప్రకటించింది. ఇప్పటికే మారుతీ సుజుకీ, టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, హోండా, ఆడి తదితర కంపెనీలు కూడా జనవరి నుంచి తమ వాహన ధరలను పెంచుతున్నట్లు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని