నెస్లేకు 4.5% రాయల్టీనే

ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం నెస్లే ఇండియా నికర విక్రయాలపై, తన మాతృసంస్థ నెస్లేకు ప్రస్తుత స్థాయిలోనే రాయల్టీ చెల్లించనుంది. రాయల్టీ పెంపు ప్రతిపాదనను వాటాదార్లు తిరస్కరించడమే ఇందుకు కారణం.

Published : 13 Jun 2024 02:11 IST

పెంపునకు నెస్లే ఇండియా వాటాదార్ల తిరస్కరణ

దిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం నెస్లే ఇండియా నికర విక్రయాలపై, తన మాతృసంస్థ నెస్లేకు ప్రస్తుత స్థాయిలోనే రాయల్టీ చెల్లించనుంది. రాయల్టీ పెంపు ప్రతిపాదనను వాటాదార్లు తిరస్కరించడమే ఇందుకు కారణం. ‘మాతృసంస్థ నెస్లే ఎస్‌.ఏ (లైసెన్సర్‌)కు ప్రస్తుత రేటైన 4.5% ప్రకారమే జనరల్‌ లైసెన్స్‌ రుసుము (రాయల్టీ) చెల్లించడాన్ని కొనసాగించాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను వాటాదార్ల అనుమతి కోసం సిఫారసు చేసింద’ని నెస్లే ఇండియా తెలిపింది. మాతృ సంస్థ నెస్లేకు చెల్లించే రాయల్టీని ఏడాదికి 0.15% చొప్పున పెంచుతూ, అయిదేళ్లలో 5.25 శాతానికి చేర్చాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో నెస్లే ఇండియా బోర్డు ప్రతిపాదించిది. 2024 జులై 1 నుంచి ఈ పెంపు అమలు చేయాలన్నది బోర్డు ఉద్దేశం. ఈ ప్రతిపాదనను మెజార్టీ వాటాదార్లు తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత రేటు ప్రకారమే రాయల్టీ చెల్లింపును కొనసాగించాలని బోర్డు ఆమోదించిందని ఎక్స్ఛేంజీలకు నెస్లే తెలియజేసింది. త్వరలో జరగనున్న 65వ ఏజీఎంలో, దీనిపై వాటాదార్ల అనుమతిని కంపెనీ కోరనుంది. 

స్వతంత్ర నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరుగా సిద్దార్ధ కుమార్‌ బిర్లాను అయిదేళ్ల కాలానికి బోర్డు నియమించింది. ఆయన నియామకం 2024 జూన్‌ 12 నుంచి అమల్లోకి రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని