భారత్‌ సీరమ్‌ కొనుగోలుకు పీఈ సంస్థలతో మ్యాన్‌కైండ్‌ చర్చలు!

భారత్‌ సీరమ్‌ అండ్‌ వ్యాక్సిన్స్‌ (బీఎస్‌వీ) సంస్థను కొనుగోలు చేసే యత్నాలను మ్యాన్‌కైండ్‌ ఫార్మా ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.

Published : 14 Jun 2024 02:05 IST

దిల్లీ: భారత్‌ సీరమ్‌ అండ్‌ వ్యాక్సిన్స్‌ (బీఎస్‌వీ) సంస్థను కొనుగోలు చేసే యత్నాలను మ్యాన్‌కైండ్‌ ఫార్మా ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఒక బృందంగా (కన్సార్షియం) ఏర్పడి, సంయుక్త బిడ్‌ వేసేందుకు పలు ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలతో ఈ కంపెనీ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.  బీఎస్‌వీని ప్రస్తుత యజమాని అయిన అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ విక్రయానికి పెట్టగానే.. బెయిన్‌ కేపిటల్, బ్లాక్‌ స్టోన్, కార్లైల్, కేకేఆర్‌ తదితర పీఈ సంస్థలు ఆసక్తి కనబర్చాయి. ఈ పీఈ సంస్థలతో మ్యాన్‌కైండ్‌ చర్చలు జరిపినా, కొన్ని మాత్రమే మ్యాన్‌కైండ్‌తో కలిసి బిడ్‌ వేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశాయని ఓ ఆంగ్లపత్రిక తెలిపింది. బ్లాక్‌స్టోన్‌ ఇప్పటికే సొంతంగా రెండు బిడ్‌లు వేసింది. వేరే సంస్థతో కలిసి బిడ్‌ వేసేందుకు సుముఖంగా లేనట్లు స్పష్టం చేసిందనీ సమాచారం. ఈ పరిణామాలపై మ్యాన్‌కైండ్, బ్లాక్‌స్టోన్‌ ప్రతినిధులు స్పందించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని