జెన్‌ఏఐ అంకురాలకు రూ.2,000 కోట్ల సహకారం

జెనరేటివ్‌ ఏఐ అంకుర సంస్థలకు 230 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2,000 కోట్లు) మేర సహకారం అందించేందుకు అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ (ఏడబ్ల్యూఎస్‌) తన ప్రణాళికగా పెట్టుకుంది.

Published : 15 Jun 2024 02:37 IST

ఏడబ్ల్యూఎస్‌ ప్రణాళిక

దిల్లీ: జెనరేటివ్‌ ఏఐ అంకుర సంస్థలకు 230 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2,000 కోట్లు) మేర సహకారం అందించేందుకు అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ (ఏడబ్ల్యూఎస్‌) తన ప్రణాళికగా పెట్టుకుంది. అంతర్జాతీయంగా జెనరేటివ్‌ ఏఐ యాక్సిలరేటర్‌ కార్యక్రమం విస్తరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 1 నుంచి 10 వారాల పాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా 80 వ్యవస్థాపకులు, అంకుర సంస్థలకు సహకారం అందివ్వనున్నారు. వీటిల్లో ఆసియా పసిఫిక్, జపాన్‌ ప్రాంతం నుంచే 20 వరకు ఉండనున్నాయి. ఈ సంస్థల వృద్ధికి ఊతమివ్వడమే ఈ నిధుల సహకారం వెనక ఉద్దేశం. ఈ కార్యక్రమంలో ఎంపికైన జెన్‌ఏఐ అంకురాలకు 1 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.8.3 కోట్లు) మేర ఏడబ్ల్యూఎస్‌ నుంచి నిధులు, నైపుణ్యాభివృద్ధి సెషన్‌లు, వ్యాపారం, సాంకేతికత అంశాలపై సలహాలు, నెట్‌వర్కింగ్‌ అవకాశాలు తదితర సహకారాన్ని అందిస్తామని ఏడబ్ల్యూఎస్‌ తెలిపింది.

ఫోన్‌ నంబర్లకు రుసుమును వసూలు చేసే ఉద్దేశంలో ఉన్నట్లు తమపై వచ్చిన వార్తా కథనాలను టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ ఖండించింది. అందులో వాస్తవం లేదని స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని