7 నెలల గరిష్ఠానికి దేశ వాణిజ్య లోటు

మేలో భారత ఎగుమతులు 9.1 శాతం పెరిగి 38.13 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు కూడా  7.7 శాతం అధికమై 61.91 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దీంతో దేశ వాణిజ్య లోటు ఏడు నెలల గరిష్ఠమైన 23.78 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.

Published : 15 Jun 2024 02:48 IST

మేలో ఎగుమతులు 9% పెరిగాయ్‌

దిల్లీ: మేలో భారత ఎగుమతులు 9.1 శాతం పెరిగి 38.13 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు కూడా  7.7 శాతం అధికమై 61.91 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దీంతో దేశ వాణిజ్య లోటు ఏడు నెలల గరిష్ఠమైన 23.78 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. 2023 అక్టోబరులో నమోదైన 31.46 బిలియన్‌ డాలర్ల తర్వాత ఇదే అత్యధిక వాణిజ్య లోటు.ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, జౌళి, ఔషధం, ప్లాస్టిక్‌ ఎగుమతులు దేశీయ ఎగుమతుల వృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. ముడి చమురు దిగుమతులు పెరగడం దేశీయ దిగుమతులు అధికంగా నమోదుకావడానికి కారణమైంది. మేలో చమురు దిగుమతులు 28 శాతం పెరిగి 20 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 2024-25 ఏప్రిల్‌- మేలో చమురు దిగుమతులు 24.4 శాతం పెరిగి 36.4 బిలియన్‌ డాలర్లుగా నమోదుకావడం గమనార్హం. అయితే మేలో పసిడి దిగుమతులు 3.69 బిలియన్‌ డాలర్ల నుంచి స్వల్పంగా తగ్గి 3.33 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- మేలో ఎగుమతులు 5.1 శాతం పెరిగి 73.12 బిలియన్‌ డాలర్లకు; దిగుమతులు 8.89 శాతం అధికమై 116 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ‘దేశీయ ఎగుమతులు మేలో ఆకర్షణీయ స్థాయిలో నమోదయ్యాయి. మున్ముందూ ఇదే ధోరణి కొనసాగుతుందని భావిస్తున్నామ’ని వాణిజ్య కార్యదర్శి సునిత్‌ భర్త్‌వాల్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని